Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లీజ్ కాస్త వదిలిపెట్టండి... పాక్‌ను చితక్కొట్టి వస్తాం... #UriAttacks జవాబుగా మోదీ ప్లానేంటి?(Video)

దారుణాతి దారుణం. భారతదేశ భూభాగం పైకి వచ్చిన ముష్కరులు ఏదో విధంగా జవానుల ప్రాణాలను కబళిస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిఫ్టు అనే విధంగా ఆదివారం తెల్లవారు జామున పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జమ్ముకశ్మీర్ లోని యూరి సైనిక శిబిరంపై దాడి చేసి సైనిక

ప్లీజ్ కాస్త వదిలిపెట్టండి... పాక్‌ను చితక్కొట్టి వస్తాం... #UriAttacks జవాబుగా మోదీ ప్లానేంటి?(Video)
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (16:32 IST)
దారుణాతి దారుణం. భారతదేశ భూభాగం పైకి వచ్చిన ముష్కరులు ఏదో విధంగా జవానుల ప్రాణాలను కబళిస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిఫ్టు అనే విధంగా ఆదివారం తెల్లవారు జామున పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జమ్ముకశ్మీర్ లోని యూరి సైనిక శిబిరంపై దాడి చేసి సైనికులపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో 17 మంది భారత సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు మృతి చెందారు. దీనితో మరణించిన వారి జవానుల సంఖ్య 20కి చేరుకుంది. 
 
పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పాకిస్తాన్ పైన యుద్ధం చేసి చితక్కొడితేనే వారికి బుద్ధి వస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే పాకిస్తాన్ దేశానికి యుద్ధంతోనే బుద్ధి తీసుకురావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత సైన్యం అయితే తమను జస్ట్ కొన్ని గంటలు వదిలిపెడితే పాకిస్తాన్ను ఓ చూపు చూసి వస్తామని పళ్లు పటపట కొరుకుతున్నారు. 
 
ఐతే ఈ కాస్త సమయం అంటూ యుద్ధం మొదలుపెడితే అది కాస్తా పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందన్న వాదనలు వినబడుతున్నాయి. అందువల్ల ఈ విషయంలో పాకిస్తాన్ దేశాన్ని వ్యూహాత్మకంగా దెబ్బ తీయాలని కొందరు వాదిస్తున్నారు. కాగా పాకిస్తాన్ ఎలాంటి బుద్ధి చెప్పాలన్న దానిపై కేంద్ర మంత్రులు సమావేశమై చర్చిస్తున్నారు. మరోవైపు భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారతదేశం గట్టిగా బుద్ధి చెపితేనే మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ కుమార్ కరెంట్ తీగ పట్టుకునేదాక పోలీసులు ఏం చేశారు.. షాక్ కొడుతుందని చూస్తుండిపోయారా?

యూరీ ఎటాక్... సోషల్ మీడియాలో పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సిందేనంటున్న వారితో మీరు కూడా ఏకీభవిస్తారా...?