Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు బావ కోసం పాట పాడింది... అపర్ణ, అపర్ణా... ఇప్పుడు ఎందుకు చీలుస్తున్నావమ్మా...?(video)

ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ సర్వనాశనం అయ్యేట్లు సూచనలు కనబడుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ చుక్కలు చూపిస్తున్నాడు. ఎస్పీ జాతీయ కార్యవర్గం అఖిలేష్ యాదవ్ పగ్గాలు అప్పజెప్పడంతో ములాయం సింగ్

అప్పుడు బావ కోసం పాట పాడింది... అపర్ణ, అపర్ణా... ఇప్పుడు ఎందుకు చీలుస్తున్నావమ్మా...?(video)
, సోమవారం, 2 జనవరి 2017 (14:27 IST)
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ సర్వనాశనం అయ్యేట్లు సూచనలు కనబడుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ చుక్కలు చూపిస్తున్నాడు. ఎస్పీ జాతీయ కార్యవర్గం అఖిలేష్ యాదవ్ పగ్గాలు అప్పజెప్పడంతో ములాయం సింగ్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. దీనికంతటికీ కారణం అపర్ణ అనే యువతి. ఇంతకీ ఎవరా యువతి, ఏంటా సంగతి?
 
ములాయం చిన్న కోడలు పేరు అపర్ణ, అంటే ఈమె ములాయం రెండో భార్య కుమారుడి భార్య. ములాయం రెండో భార్య సాధనాగుప్తా పార్టీలో అఖిలేష్ చేతుల్లోంచి ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి అపర్ణ యాదవ్‌ను తెరమీదకు తీసుకురావడంతో ముసలం మొదలైంది. రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న అపర్ణ యాదవ్ ఎస్పీ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు.
 
బాబాయ్ శివపాల్ యాదవ్-అబ్బాయ్ అఖిలేష్ యాదవ్ పోరులో ములాయం శివపాల్ యాదవ్‌నే వెనుకేసుకురావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. ములాయం రెండో భార్య సాధనాగుప్తా శివపాల్ యాదవ్‌కే మద్దతు పలకాలని ములాయంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీనితో అఖిలేష్ యాదవ్‌ వర్సెస్ ములాయం సింగ్ యాదవ్‌గా సీన్ మారిపోయింది.
 
ములాయం సింగ్ రెండో కుమారుడు ప్రతీక్‌కు రాజకీయాలంటే కిట్టదు. అందుకే దూరంగా ఉన్నాడు. కానీ ఆయన భార్య అపర్ణకు మాత్రం పోలిటిక్స్ అంటే చాలా ఇష్టం. మరోవైపు అపర్ణ యాదవ్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఏంటంటే.. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిమాని. 2015లో ములాయం మనవడి పెళ్లి సందర్బంగా భర్త ప్రతీక్‌తో కలిసి మోదీతో ఓ సెల్ఫీ దిగారు. అప్పట్లో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అపర్ణ అంటే అఖిలేష్ యాదవ్ కు నిద్రపట్టడం లేదని తెలుస్తోంది. యూపీ రాజకీయాల్లో ఆమె చక్రం తిప్పుతుందనీ, ఫలితంగా తన స్థానానికి చెక్ పడే అవకాశం ఉందని ఆయన భయపడటం వల్లనే కోడలికి ప్రాధాన్యత ఇస్తున్న ములాయం సింగ్ యాదవ్ ను సైతం ఎదిరించి పార్టీని నిట్టనిలువునా చీల్చి చెండాడేస్తున్నారు. కానీ 2014లో బావ అఖిలేష్ కోసం అపర్ణ పాట కూడా పాడింది. అది యూ ట్యూబులో ఉంది. అలాంటి పార్టీకి ఈ గతి పడుతోంది. చూద్దాం... ఏం జరుగుతుందో?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయను కాపాడలేని శశికళ పార్టీని ఏం కాపాడుతుంది: దీపన్ ప్రశ్న.. ఈయన ఎవరో తెలుసా?