Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సార్‌...! మరో అవకాశం ప్లీజ్‌.. చంద్రబాబు చుట్టు తితిదే ఛైర్మన్‌ ప్రదక్షిణలు

తితిదే ఛైర్మన్ పదవి. ఈ పదవి గురించి పెద్దగా చెప్పనప్పనవసరం లేదు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఈ పదవి అన్నా.. ఆ పదవిలో ఉన్న హుందా తనమనం గురించి బాగా తెలుసు. అలాంటి పదవి కోసం జరిగే పైరవీలు అన్నీ ఇన్నీ

సార్‌...! మరో అవకాశం ప్లీజ్‌.. చంద్రబాబు చుట్టు తితిదే ఛైర్మన్‌ ప్రదక్షిణలు
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:45 IST)
తితిదే ఛైర్మన్ పదవి. ఈ పదవి గురించి పెద్దగా చెప్పనప్పనవసరం లేదు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఈ పదవి అన్నా.. ఆ పదవిలో ఉన్న హుందా తనమనం గురించి బాగా తెలుసు. అలాంటి పదవి కోసం జరిగే పైరవీలు అన్నీ ఇన్నీ కావు. అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వారికి చెందిన వ్యక్తినే ఆ పదవిలో కూర్చోబెడతారు. అలాంటి పదవినే ఎలాగోలా సాధించారు చదలవాడ కృష్ణమూర్తి.
 
అయితే చదలవాడ కృష్ణమూర్తి అదృష్టమో, దురదృష్టమో ఏమో గానీ ఆయన పదవీ కాలం కాస్త సంవత్సరం నుంచి రెండేళ్లకు మారింది. సాధారణంగా ఐదేళ్లపాటు ఒకే వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెడతారు. అయితే గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి కాలాన్ని కుదించారు. కేవలం సంవత్సరం మాత్రమే చదలవాడ కృష్ణమూర్తికి ఇవ్వగా ఆ తర్వాత మరో సంవత్సరం పొడిగించారు. ఇక పొడిగించే ఆలోచన లేనట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రేసులో ఇంకా చాలామందే ఉన్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది రాయపాటి సాంబశివరావు. ముందు నుంచి ఆ పదవి కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణ చేసిన వారిలో మొదటి వ్యక్తి ఈయనే.
 
అటు పారిశ్రామికవేత్తగాను, ఇటు రాజకీయంగాను మంచి పేరున్న రాయపాటి అంటే బాబుకు ఇష్టమే. అయితే చదలవాడ కృష్ణమూర్తికి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఆ పదవిని ఆయనకే అప్పగించారు. ప్రస్తుతం చదలవాడ పదవితో పాటు ఆ పాలకమండలి పదవి కాస్త సమయం ముగిసిపోయే సమయం వచ్చేంది. అందుకే ఇక మళ్ళీ చదలవాడ కృష్ణమూర్తి తిరిగి భజన ప్రారంభించారు. బాబు చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు.
 
గత రెండు రోజులుగా తిరుపతిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చుట్టూనే చదలవాడ కృష్ణమూర్తి ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతేకాదు తనకు తెలిసిన పరిచయాలతో ఎలాగోలా తిరిగి పదవీ కాలాన్ని పొడిగించుకునే ఆలోచనలో ఉన్నారు. సోమవారం తిరుపతిలో పర్యటించిన వెంకయ్యనాయుడు దృష్టికి ఈ విషయాన్నే తీసుకెళ్ళినట్టు సమాచారం. తన పేరెత్తకుండానే పాలకమండలి అలాగే కొనసాగితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. వెంకయ్యనాయుడు దృష్టికి ఎందుకు తీసుకెళ్ళారంటే ఆయన సిఫారసు చేసిన భానుప్రకాష్‌ రెడ్డి కూడా పాలకమండలి సభ్యులుగా ఉన్నారు కాబట్టి.
 
అందుకే చదలవాడ తెలివిగా అలా వెంకయ్య వద్ద మాట్లాడడం ప్రారంభించాడు. చదలవాడ కృష్ణమూర్తి ఎన్నిప్రదక్షిణలు చేసినా బాబు కరిగేట్టు కనబడటం లేదు. ఆ పదవిని వేరొకరికి అప్పగించే ప్రయత్నం అప్పుడే ప్రారంభమైంది. చంద్రబాబు చుట్టూత చదలవాడ కృష్ణమూర్తి ప్రదక్షిణ చేస్తుండటంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు చూసి వెనుక నుంచి నవ్వుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ వాహనాలకు చెక్.. ఇకపై అధికారులకు ట్యాక్సీలే అద్దె వాహనాలు.. కేంద్ర నిర్ణయం