Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 పెళ్లిళ్లు చేసుకున్నాడు... 4 సార్లు దివాలా తీశాడు... 70 ఏళ్లకు అమెరికా అధ్యక్షుడయ్యాడు... ట్రంప్ స్టోరీ

మీడియా అతడిని ప్రపంచంలో పెద్ద జోకర్ అంటూ జోకులు పేలుస్తూ కథనాలు రాసింది. ఆ మాటకొస్తే... అతడు అమెరికా అధ్యక్షుడు అవ్వడం కల్ల అని చాలామంది చెప్పారు కూడా. కొందరు నాయకులైతే ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని తెరమీదికి తెచ్చి రచ్చరచ్చ చేశారు. ఐనా అమెరికన్లు ఆయనన

3 పెళ్లిళ్లు చేసుకున్నాడు... 4 సార్లు దివాలా తీశాడు... 70 ఏళ్లకు అమెరికా అధ్యక్షుడయ్యాడు... ట్రంప్ స్టోరీ
, గురువారం, 10 నవంబరు 2016 (15:05 IST)
మీడియా అతడిని ప్రపంచంలో పెద్ద జోకర్ అంటూ జోకులు పేలుస్తూ కథనాలు రాసింది. ఆ మాటకొస్తే... అతడు అమెరికా అధ్యక్షుడు అవ్వడం కల్ల అని చాలామంది చెప్పారు కూడా. కొందరు నాయకులైతే ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని తెరమీదికి తెచ్చి రచ్చరచ్చ చేశారు. ఐనా అమెరికన్లు ఆయననే అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. అసలింతకీ ఎవరీ ట్రంప్... ఏంటి ఆయన హిస్టరీ... కాస్త తెలుసుకుందాం రండి.
 
అమెరికా అధ్య‌క్షునిగా అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేసిన ట్రంప్ అంతకుముందు ఎన్నిక‌ల స‌మ‌యంలో, దానికి ముందు ఆయ‌న వ్యాపారిగా ఉన్న స‌మ‌యంలో చేసిన రాస‌లీల గురించి చెప్పుకుంటే ఓ పెద్ద గ్రంథ‌మే అవుతుంది. మ‌హిళ‌ల ప‌ట్ల ట్రంప్ వ్య‌వ‌హ‌రించిన తీరు వారితో ఆయ‌న మాట్లాడే ప‌ద్ధ‌తి… ఎన్నికల పర్యటనలకు వెళ్లినప్పుడు మహిళల ఎదల పైన ఆటోగ్రాఫ్‌లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. 70 ఏళ్ల వయసులోనూ చిలిపి చేష్టలు చేస్తూ, కవ్వింపు మాటలతోనే చెలరేగిపోయారు ట్రంప్.
 
ఆయన జీవితంలోకి ఇంకాస్త తొంగిచూస్తే అందమైన యువతులతో డేటింగ్ చేసిన చరిత్ర ట్రంప్ సొంతం. డేటింగ్ చేసినవారిలో ముగ్గురిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుత సతీమణి అయిన మెలీనియాతో సహా. ట్రంప్ 1946లో న్యూయార్క్ నగరంలో జన్మించారు. అతడికి క్రమశిక్షణ చాలా అవసరమని తల్లిదండ్రులు ఆయన్ను న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చేర్పించారు. ఐతే ఆయన మిలటరీ అకాడమీలో చేరిన సమయంలో వియత్నాం యుద్ధం వచ్చింది. ఆ సమయంలో అమెరికా మిలటరీకి సాయం చేయాల్సింది పోయి చేతులు ముడుచుకుని కూర్చున్నాడు అప్పట్లో. 
 
పెన్సిల్వేనియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక తన తండ్రి చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. తన తండ్రి చేసే వ్యాపారం అలా ఉండగానే ట్రంప్ సొంతగా ఒక మిలియన్ డాలర్లతో వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారం సంగతి ఏమోగానీ, అనతి కాలంలో ఆయన అమ్మాయిల చుట్టూ తిరిగే అబ్బాయిగా మారిపోయాడు. ఆ క్రమంలో రాసలీలలు షురూ అయ్యాయి. మరోవైపు వ్యాపారం కూడా జోరందుకుంది. 1983లో 58 అంస్తుల ట్రంప్ టవర్ నిర్మించాడు. 
 
ఐతే ట్రంప్ ప్రాజెక్టులు ఆయనకు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అతను వరుసబెట్టి ప్రారంభించిన ట్రంప్ రియల్ ఎస్టేట్, ట్రంప్ యూనివర్శిటీ, ట్రంప్ మార్టొగేజ్, ట్రంప్ ఎయిర్ లైన్స్ కంపెనీలు విఫలమయ్యాయి. ఆ క్రమంలో ఆయన నాలుగుసార్లు దివాళా తీసినట్లు పేర్కొన్నారు కూడా. ఐనా ఏదో రకంగా నెట్టుకొచ్చారు. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఆయన 156 స్థానాన్ని సైతం దక్కించుకున్నాడు. 
 
2000 సంవత్సరంలో పోటీ చేశాడు కానీ నెగ్గలేకపోయారు. మళ్లీ 2016లో ఆయన పేరు వినబడింది కానీ, అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే అభ్యర్థిగా వస్తాడని అంచనాలు కూడా లేవు. ఐతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా 45వ అధ్యక్షుడుగా ఎన్నికై ప్రపంచాన్నే నివ్వెరపరిచాడు. దటీజ్ ట్రంప్. ఇక ప్రపంచానికే పెద్దన్నగా అమెరికా కొత్త అధ్యక్షుడు ఎన్నెన్ని కొత్త కోణాలను చూపిస్తారో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్‌కార్డ్ ఉంటేనే బంగారం కొనుగోలు .. అన్ని నగదు డిపాజిట్లపై డేగ కన్ను