Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ ఏం చేశారో తెలుసా...?

పదవులను అనుభవించిన తరువాత పార్టీకి ముఖం చాటేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది చాలామంది టిడిపి నాయకులకు. ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీని నట్టేట ముంచి వెళ్ళిపోతున్నారు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీ కోసమే పని చేశానంటూ పదవులు పొందేటప్పుడు తెగ హడావ

టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ ఏం చేశారో తెలుసా...?
, శుక్రవారం, 28 జులై 2017 (16:35 IST)
పదవులను అనుభవించిన తరువాత పార్టీకి ముఖం చాటేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది చాలామంది టిడిపి నాయకులకు. ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీని నట్టేట ముంచి వెళ్ళిపోతున్నారు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీ కోసమే పని చేశానంటూ పదవులు పొందేటప్పుడు తెగ హడావిడి చేసే నాయకులు తీరా అది అనుభవించి తమ దారి తాము చూసుకుంటున్నారు. మొన్నటిదాకా టిటిడి ఛైర్మన్‌గా చక్రం తిప్పిన చదలవాడ క్రిష్ణమూర్తి ఇప్పుడు కనిపించడమే మానేశారు. పార్టీ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతారన్న ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో చదలవాడ ఏం చేస్తున్నారు.. నిజంగానే పార్టీ మారబోతున్నారా?
 
తిరుపతికి చెందిన చదలవాడ క్రిష్ణమూర్తి ఎన్నో యేళ్ళుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో తిరుపతిలో ఒకే ఒక్క నాయకుడిగా ఉన్నారు చదలవాడ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో ఆ పార్టీ నేతలందరూ ఒక్కసారిగా టిడిపిలోకి వచ్చేశారు. అందులో మాజీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెంకటరమణ కూడా ఉన్నారు. వెంకటరమణ, చదలవా డక్రిష్ణమూర్తిలు ఇద్దరూ బద్ధ శత్రువులు. ఒకరంటే ఒకరికి పడదు. ఎన్నికల్లో చివరివరకు తనకే సీటు ఖాయమనుకుంటున్న సమయంలో వెంకటరమణ కాస్త ఆ సీటును లాక్కున్నాడు. ఏకంగా టిడిపి అధినేతలతో సంప్రదింపులు జరిపిన వెంకటరమణకు సీటు ఈజీగా దొరికేసింది. దీంతో చదలవాడ క్రిష్ణమూర్తి అలకబూనాడు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం చదలవాడ క్రిష్ణమూర్తికి హామీ ఇచ్చాడు. 
 
ఎన్నికల ప్రచారం సమయంలో చదలవాడ క్రిష్ణమూర్తిని స్వయంగా తీసుకెళ్ళిన బాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టిటిడి ఛైర్మన్ పదవిని ఆయనకే ఇస్తామని హామీ ఇచ్చాడు. దీంతో చదలవాడ క్రిష్ణమూర్తి కాస్త మెత్తబడ్డారు కానీ వెంకటరమణకు మాత్రం ఎన్నికల్లో సహకరించలేదు. తనకున్న చరిష్మాతో వెంకటరమణ ఎన్నికల్లో గెలిచిపోయాడు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చేసింది. అనుకున్నవిధంగా తనకు టిటిడి ఛైర్మన్ పదవి ఖాయమన్న నిర్ణయానికి చదలవాడ క్రిష్ణమూర్తి వచ్చేశాడు. చంద్రబాబు మాత్రం చాలా ఆలస్యంగా ఆ పదవిని చదలవాడకు అప్పజెప్పారు. 
 
అదికూడా మొదట్లో సంవత్సరం మాత్రమే ఇస్తున్నానని చెప్పి ఆ తరువాత మరో యేడాదికి పొడిగించారు. రెండు సంవత్సరాలు కాస్తా పూర్తయ్యింది. చదలవాడ టిటిడి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పార్టీ నేతలను ఎవరినీ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు స్వయంగా వెళ్ళి తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు అడిగినా ముఖం మీదే లేదని చెప్పి చదలవాడ పంపేశారట. దీంతో టిడిపిలోని నేతలందరూ ఆయనపై కోపంగా ఉన్నారు.
 
టిటిడి ఛైర్మన్ పదవి ముగియక ముందే పార్టీలోనే వేరే ఏ పదవైనా లభిస్తుందని ఆశ పెట్టుకున్నారు చదలవాడ. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దేనికి హాజరు కాకుండా వుంటున్నారు. ఈమధ్య ఎప్పుడో ఒకసారి అధినేత తిరుపతికి వస్తే మాత్రం అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారు చదలవాడ క్రిష్ణమూర్తి. పార్టీలో సీనియర్ నేతగా ఉండి, పార్టీ ఇచ్చిన పదవులను అలంకరించి అన్నీ అయిపోయిన తరువాత పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేనట్లు చదలవాడ క్రిష్ణమూర్తి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేస్తోంది. చదలవాడ తీరును స్వయంగా చంద్రబాబు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు చదలవాడ క్రిష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేకుంటే పార్టీ మారుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమా...? ఎలా?