Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాశమే హద్దుగా తిరుమలేశుని ఆర్థిక వైభవం.. ఎలా?

ప్రపంచంలో అతి పెద్ద హిందూ క్షేత్రంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. దానికి తగినట్టుగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం ఖండాంతరాలను ఎప్పుడో దాటేసింది. 1933 నుంచి తిరుమలేశుని దేవాలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న తిరుమల త

Advertiesment
ఆకాశమే హద్దుగా తిరుమలేశుని ఆర్థిక వైభవం.. ఎలా?
, శనివారం, 19 మే 2018 (14:07 IST)
ప్రపంచంలో అతి పెద్ద హిందూ క్షేత్రంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. దానికి తగినట్టుగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం ఖండాంతరాలను ఎప్పుడో దాటేసింది. 1933 నుంచి తిరుమలేశుని దేవాలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాల వార్షిక బడ్జెట్ అంచెలంచెలుగా పెరుగుతూ దేశంలోని నాలుగైదు చిన్న రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను అధిగమించే స్థాయికి చేరుకుంటోంది. 
 
2004-15 వార్షిక అంచనాల బడ్జెట్ రూ.654కోట్లు కాగా 2007-08 ఆర్థిక సంవత్సరానికి వెయ్యికోట్లను అధిగమించి రూ.1.170 కోట్లకు చేరుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 వేల కోట్లను అధిగమించిన బడ్జెట్ అంచనాలను రూ.2,160గా నమోదైంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,261 కోట్లకు చేరుకున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.2,858 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. మరో నాలుగైదేళ్ళలోనే టిటిడి వార్షిక బడ్జెట్ మొత్తం 3 వేల కోట్లను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
గత దశాబ్ద కాలం క్రితం ప్రతిరోజూ వచ్చే హుండీ ఆదాయం కోటి లోపు ఉండగా 2010-11 నుంచి ఆ సగటు ఆదాయం కోటి దాటింది. 2013-14 మధ్యకాలంలో 2 కోట్ల దినసరి సగటు హుండీ ఆదాయం పెరుగగా ప్రస్తుత సంవత్సరం ఆ మొత్తం 3 కోట్లు దాటే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఐదారేళ్ళలో మధ్యకాలంలో తిరుమలేశుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య శ్రీవారి హుండీ వార్షికాదాయం, స్వామికి తలనీలాలు సమర్పించే వారి సంఖ్య ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వరుని దివ్య ప్రసాదంగా అన్నప్రసాదాలను స్వీకరించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తీరుకు అధికారిక సమాచారం తెలిపే సాక్షాలివే.
 
2012 సంవత్సరంలో తిరుమలేశుని 2.17 కోట్లమంది దర్సించుకున్నారు. ఆ యేడాది హుండీ ద్వారా 759 కోట్ల ఆదాయం లభించింది. తిరుమలేశుని భక్తితో తలనీలాలు సమర్పించేవారి సంఖ్య కోటి 14 లక్షలుగా నమోదు కాగా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన ప్రసాద సముదాయంలో ఆ యేడాదిలో కోటి 99 లక్షల మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. 
 
2013 సంవత్సరంలో తిరుమలేశుని 2.22 కోట్ల మంది దర్సించుకున్నారు. ఆ యేడాది హుండీ ద్వారా రూ.834 కోట్ల ఆదాయం లభించింది. తిరుమలేశునికి భక్తితో తలనీలాలు సమర్పించే వారి సంఖ్య కోటి 6 లక్షలుగా నమోదు కాగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద సముదాయంలో ఆ యేడాదిలో 2 కోట్ల 7 లక్షల మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. 2014 సంవత్సరంలో తిరుమలేశునికి 2.26 కోట్ల మంది దర్సించుకున్నారు. ఆ యేడాది హుండీ ద్వారా 854 కోట్ల ఆదాయం లభించింది. తిరుమలేశునికి భక్తితో తలనీలాలు సమర్పించే వారి సంఖ్య కోటి 16 లక్షలుగా నమోదు కాగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద సముదాయంలో ఆ యేడాదిలో 2 కోట్ల 15 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు.
 
ఇలా సంవత్సరం సంవత్సరం ఆదాయం పెరుగుతూనే వస్తోంది. తిరుమలేశునిపై ఉన్న అంచెంచల భక్తివిశ్వాసాలకు దర్పణం పట్టడమే కాక సమీప భవిష్యత్తులో టిటిడి వార్షిక అంచనాల బడ్జెట్ రూ.3వేల కోట్లను అధిగమించబోతున్నదని చాటి చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక ఫైట్ : బీజేపీ నుంచి ఒక్కరు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అజ్ఞాతం