Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌ నమ్మకాలు.. మొక్కుల చెల్లింపులు... ప్రజలపై రూ.కోట్ల భారం...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఉన్న ఆధ్యాత్మిక భక్తి, ఇతర నమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేసమయంలో తన మొక్కులు, నమ్మకాల కార్యసిద్ధి కోసం ఆయన పూజలు, హోమాలు చేస్తుంటారు.

కేసీఆర్‌ నమ్మకాలు.. మొక్కుల చెల్లింపులు... ప్రజలపై రూ.కోట్ల భారం...
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (14:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఉన్న ఆధ్యాత్మిక భక్తి, ఇతర నమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేసమయంలో తన మొక్కులు, నమ్మకాల కార్యసిద్ధి కోసం ఆయన పూజలు, హోమాలు చేస్తుంటారు. ఇందుకోసం సీఎం హోదాలో కేసీఆర్ చేస్తున్న ఖర్చు కాస్తంత ఎక్కువగానే ఉంది. చివరకు ఈ మొత్తం ఖర్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైనే పడుతుంది. మత సంబంధమైన, తన వ్యక్తిగత నమ్మకాల కోసం కేసీఆర్ ప్రజా ధనాన్ని ఉపయోగించడం ఇదే ప్రథమం కాదు.
 
ఇటీవలే కేసీఆర్ అత్యంత విలాసవంతమైన కొత్త భవంతిలోకి తన నివాసాన్ని మార్చారు. హైదరాబాద్ నడిబొడ్డున 9 ఎకరాల స్థలంలో ఈ భవంతిని నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత చెప్పినప్పటికీ... ఫైనల్ బిల్ మాత్రం రూ.50 కోట్లు వచ్చిందని ఓ జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 
 
అలాగే, వరంగల్ వద్ద ఉన్న భద్రకాళి అమ్మవారికి రూ.3 కోట్లతో 11 కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారు. తాజాగా, తిరుమల వెంకన్నకు ఆయన చెల్లించుకోనున్న మొక్కుల వల్ల సామాన్యులపై రూ.5.6 కోట్ల భారం పడనుంది. తిరుమల వెంకన్నకు స్వర్ణాభరణాలను, పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను ఆయన సమర్పించనున్నారని చెప్పింది. 
 
ఇందుకోసం కేసీఆర్ కుటుంబంతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా రెండు విమానాల్లో రేణిగుంటకు వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌ ద్వారా తిరులమ కొండపైకి చేరుకుంటారు. ఈ పర్యటన కోసం అయ్యే మొత్తం ఖర్చును తెలంగాణ ప్రభుత్వం ఖజానా నుంచే చెల్లించనున్నారు. కేసీఆర్ తన వ్యక్తిగత విలాసాలు, మతపరమైన కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రతిపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ... ఆయన ఏ మాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయశాంతిని శశికళ రమ్మంటున్నారా? రాములమ్మ కోసం రెడీ చేస్తున్నారట...