Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక నా వల్ల కాదు... పార్టీని వదిలేస్తా - చిత్తూరు తెదేపా ఎమ్మెల్యే సత్యప్రభ?

చిత్తూరు ఎమ్మెల్యే డి.ఎ.సత్యప్రభ తెలుగుదేశం పార్టీని వదిలేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఎమ్మెల్యేకి ఒక్కసారిగా మరో ఉపద్రవం వచ్చి పడింది. డి.కె. ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం.. కోట్ల రూపాయలు స్వాధీనం చేస

ఇక నా వల్ల కాదు... పార్టీని వదిలేస్తా - చిత్తూరు తెదేపా ఎమ్మెల్యే సత్యప్రభ?
, బుధవారం, 5 అక్టోబరు 2016 (16:36 IST)
చిత్తూరు ఎమ్మెల్యే డి.ఎ.సత్యప్రభ తెలుగుదేశం పార్టీని వదిలేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఎమ్మెల్యేకి ఒక్కసారిగా మరో ఉపద్రవం వచ్చి పడింది. డి.కె. ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం.. కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో డి.కె.కుటుంబం ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
 
చిత్తూరు రాజకీయాలనే కాదు.. దేశ రాజకీయాల్లోను కీలకంగా ఉన్న వ్యక్తి డి.కె.ఆదికేశవులనాయుడు. టిటిడి ఛైర్మన్‌గా, ఎంపిగా, ఎన్నో పదవులను అలంకరించారు. అయితే అనారోగ్యంతో మరణించారు డి.కె. ప్రస్తుతం ఉన్న ఆస్తులంతా డి.కె.ఆదికేశవులనాయుడు సంపాందించవే. అయితే ఆ ఆస్థులను కాపాడుకునేందుకే తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన భార్య డి.ఎ.సత్యప్రభ. చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
 
ఆ తరువాత కొన్నిరోజుల పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నా పార్టీలోని కొంతమంది ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటూ వచ్చారు. కొన్నిరోజులకు ఇంటిలో నడుస్తుండగా కాలు జారి కిందపడి కాళ్ళకి ఆపరేషన్‌ చేయించుకున్నారు సత్యప్రభ. ఆ తరువాత ఇంటి వద్దే ఉన్న ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.
 
అనారోగ్యంగా ఉండగానే ఒక్కసారిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులకు దిగారు. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో డికె కుటుంబానికి చెందిన పరిశ్రమలు, కళాశాలలపై దాడికి దిగారు. బెంగుళూరు వైట్‌ ఫీల్డ్ సమీపంలోని వైదేహి కళాశాలలో 50 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఒకవైపు అనారోగ్యంతో పాటు మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఎమ్మెల్యే సత్యప్రభ. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తన ఆస్తులపైనే దాడులు చేయడంపై సత్యప్రభ ఆగ్రహంతో ఉన్నారట. రెండురోజుల క్రితం తన బంధువులతో సుదీర్ఘంగా చర్చించిన సత్యప్రభ పార్టీకి దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారట. తను ఒకటే కాకుండా కుమారుడు డి.కె.శ్రీనివాసులును కూడా పార్టీ నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయానికి కూడా వచ్చారట. బంధువులతో పాటు కార్యకర్తలతో కూడా మాట్లాడిన సత్యప్రభ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సత్యప్రభ లాంటి ఎమ్మెల్యే పార్టీని వదిలితే చిత్తూరుజిల్లాలో పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు.
 
సత్యప్రభను బుజ్జగించే ప్రయత్నం చేయడానికి సిద్థమవుతున్నారట సీనియర్‌ నాయకులు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా తాను మాత్రం పార్టీని వీడి ప్రశాంతంగా గడపాలన్న నిర్ణయానికి వచ్చేశారట సత్యప్రభ. మొత్తం మీద చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో సిమ్ యాక్టివేట్ కావడంలేదు మహాప్రభో... నాకు 40 రోజుల తర్వాత అయ్యింది... ఇక నీ సంగతేంటి?