ఏపీలో టీడీపీ - బీజేపీ స్నేహబంధానికి కటీఫ్? ఆ పత్రిక సర్వే ఫలితమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ స్నేహబంధానికి కటీఫ్ ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నంకానున్నాయని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ రెండు పార్టీలు విడిపోతేనే బెటరంటూ ఈ సర్వే తేల్చింది. అందుకు సర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ స్నేహబంధానికి కటీఫ్ ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నంకానున్నాయని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ రెండు పార్టీలు విడిపోతేనే బెటరంటూ ఈ సర్వే తేల్చింది. అందుకు సర్వే ఫలితాల్నే సాక్ష్యంగా చూపిస్తోంది. గతంలో లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ముందు సర్వే పేరుతో విడుదల చేసిన సంస్థతోనే ఈ సర్వే కూడా చేయించింది. ముఖ్యంగా ఏపీ విషయంలో బీజేపీతో కలిపి పోటీ కంటే విడిగా చేస్తేనే బెటరని సర్వేలో తేలినట్టు రాసుకొచ్చింది.
ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే 46.53 శాతం ఓట్లతో 120 సీట్లు (కలిసి పోటీ చేస్తే) దక్కించుకుంటాయట. అయితే, టీడీపీ విడిపోయి పోటీ చేస్తే మాత్రం 46.47 శాతం ఓట్లతో ఏకంగా 140 సీట్లను గెలుచుకుంటుందని చెప్పింది. అదే బీజేపీ 5.38 శాతం ఓట్లనే మాత్రమే దక్కించుకుంటుందని పేర్కొంది.
ఇక టీడీపీ - బీజేపీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి 50 సీట్లు వస్తాయని, ఆ రెండు పార్టీలు విడివిడిగా దిగితే వైసీపీ కేవలం 30కే రరిమితమవుతుందట. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసి 106 స్థానాలు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మరోవైపు ఆ పత్రిక సర్వేపై ఏపీ బీజేపీలోని కొంతమంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.