Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

37 యేళ్ల ఐపీఎస్ సర్వీస్.. సంపాదన 3 గదుల ఇల్లు… 2 ఎకరాల పొలం… దటీజ్ యూపీ డీజీపీ నిజాయితీ

ప్చ్… ఎందుకొస్తారండీ… ఖాకీ బట్టలేసుకుని..? పేరుకు ఐపీఎస్… 37 యేళ్ల సర్వీసు… ఏం సంపాదించాడు..? ఆఫ్టరాల్… రూ.3 లక్షల విలువచేసే 2.3 ఎకరాల పొలం. లక్నోలో వాయిదాలతో కొనుక్కున్న ఓ మూడు గదుల సాదాసీదా ఇల్లు. అ

37 యేళ్ల ఐపీఎస్ సర్వీస్.. సంపాదన 3 గదుల ఇల్లు… 2 ఎకరాల పొలం… దటీజ్ యూపీ డీజీపీ నిజాయితీ
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:53 IST)
ప్చ్… ఎందుకొస్తారండీ… ఖాకీ బట్టలేసుకుని..? పేరుకు ఐపీఎస్… 37 యేళ్ల సర్వీసు… ఏం సంపాదించాడు..? ఆఫ్టరాల్… రూ.3 లక్షల విలువచేసే 2.3 ఎకరాల పొలం. లక్నోలో వాయిదాలతో కొనుక్కున్న ఓ మూడు గదుల సాదాసీదా ఇల్లు. అసలు ఈ మాట చెప్పటానికి ఎంత చిన్నతనంగా ఉంది.? ఈ విషయం తెలిసిన ఇతర ఐపీఎస్ అధికారులు.. తక్షణం ఆ అధికారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలంటూ గోల చేస్తారేమో…!! 
 
ఎందుకంటే.. హోం గార్డులు, కొత్త పోలీసులు కూడా పిచ్చిపిచ్చిగా సంపాదిస్తున్న రోజుల్లో ఓ నిజాయితీ కలిగిన డీజీపీ కథ ఇదంటే నమ్ముతారా? కానీ నిజమే… యూపీ కొత్త డీజీపీగా ఎన్నికైన సుల్కాన్ సింగ్ యధార్థగాధ. తన నెల వేతనం మినహా ఒక్కపైసా కూడా లంచం తీసుకోరు. అసలు ఈరోజుల్లో అలాంటివాళ్లు కూడా ఉంటారా? అని విస్తుపోయే సాదాసీదా నిరాడంబరుడు. 
 
ఇలాంటి వారు యావత్ భారత్‌లో ఉండరేమో...? కానీ యూపీలో ఒకే ఒక్కడు ఉన్నారు. వాస్తవానికి యూపీ అంటేనే నేరస్థులకు భూతలస్వర్గం… పేకాటల దగ్గర్నుంచి ఆయుధాల తయారీ దాకా అక్కడ అనేక మాఫియాలు, గ్యాంగులు, డెన్లు… వీరితో చేతులు కలిపితే ఇక పోలీసులకు స్వర్గమే. జస్ట్, చూసీచూడనట్టు ఉంటే చాలు… కట్టలకు కట్టలు… లెక్కపెట్టుకోలేనంతగా నోట్ల కట్టలు. 
 
అలాంటిచోట 37 యేళ్ళ సర్వీసును ఎక్కడా టెంప్ట్‌గాకుండా నిజాయితీగా ఉండగలగడం ఈరోజుల్లో మామూలు విషయం కాదు. బలమైన వ్యక్తిత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు… నిజానికి ‘భారీ రేట్ల’తో డీజీపీ పదవుల విక్రయాలు జరిగే యూపీ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఐపీఎస్‌కు ఇపుడు గుర్తింపు దక్కింది. అదీ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గుర్తించి, డీజీపీగా నియమించారు.
webdunia
 
సుల్కాన్ సింగ్... 1980 కేడర్ ఐపీఎస్ అధికారి. 2007లో ములాయం సింగ్ హయాంలో జరిగిన భారీ పోలీసు రిక్రూట్‌మెంట్ స్కాంకు తెరతీశారు గానీ, లేకపోతే సుల్కాన్ సింగ్ ఎప్పుడో డీజీపీ అయ్యేవాడు. ఆ తర్వాత మొత్తం అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లోనే వేశారు. అఖిలేష్ హయాంలోనూ సుల్కాన్ సింగ్‌కన్నా ఎనిమిది మెట్లు కింద ఉన్న జావీద్ అహ్మద్‌ను డీజీపీగా నియమించారు. 
 
అప్పుడు అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న ఈ సుల్కాన్ సింగ్‌ను తీసుకుపోయి ఓ డీఐజీ ర్యాంకు అధికారిని నియమించారు. ఇది వాస్తవం. ఇప్పటికి ఆయన గుర్తింపు లభించింది. ఈయన పదవీకాలం వచ్చే సెప్టెంబరుతో ముగియనుంది. శెభాష్… శెభాష్… సుల్కాన్ సింగ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడనీ... కన్నకొడుకును దారుణంగా చంపేసిన కసాయి తండ్రి...