Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృద్ధ చైనా... వెక్కిరిస్తున్న ఇతర దేశాలు... ఎందుకో తెలుసా?

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా క్రమంగా వృద్ధ చైనాగా మారిపోతోంది. అక్కడ 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 23 కోట్లు. 2016 జనాభా లెక్కల ప్రకారం ఇది చైనా దేశ జనాభాలో 16.7 శాతం. అంటే... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక దేశంలోని మొత్తం జనాభాలో పది శాత

వృద్ధ చైనా... వెక్కిరిస్తున్న ఇతర దేశాలు... ఎందుకో తెలుసా?
, మంగళవారం, 10 జులై 2018 (19:38 IST)
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా క్రమంగా వృద్ధ చైనాగా మారిపోతోంది. అక్కడ 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 23 కోట్లు. 2016 జనాభా లెక్కల ప్రకారం ఇది చైనా దేశ జనాభాలో 16.7 శాతం. అంటే... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక దేశంలోని మొత్తం జనాభాలో పది శాతాన్ని మించి వృద్ధులు వున్నట్లయితే ఆ దేశాన్ని వృద్ధ దేశంగా పరిగణిస్తారు. ఇప్పుడు పరిస్థితి చైనాకు ఎదురవుతోంది. 
 
దీనికి ప్రధాన కారణం చైనా అమలు చేసిన వివాదాస్పద కుటుంబ నియంత్రణ విధానం. ఈ కారణంగా చైనా జనాభా గణనీయంగా పడిపోయింది. 1979లో ఇద్దరికి ఒక్కరే అనే నిబంధనను కఠినంగా అమలుచేయడంతో అక్కడ జననాల రేటు దారుణంగా పడిపోయింది. 2016 నాటికి సుమారు 40 కోట్ల మంది జనాభా తగ్గుదల చైనాలో కనిపించింది. ఇది కాస్తా ఇప్పుడు చైనాను పట్టుకుని పీడిస్తోంది. 
 
చైనాలో ఎక్కడ చూసినా వృద్ధులు తప్ప యువకులు కనబడటంలేదు. దీనితో మళ్లీ హడావుడిగా 2016లో ఇద్దరికి ఇద్దరు అంటూ నిబంధనను సడలించింది. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. చైనా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2050 నాటికి చైనా జనాభా ఇండియా జనాభాలో 65 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు లెక్కలు కట్టి చూపిస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశంగా వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కుటుంబ నియంత్రణను రద్దు చేయాలని సూచిస్తున్నారు. మరి చైనా ఏం చేస్తుందో చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడిపై యుద్ధానికి సుబ్రమణ్యస్వామి రెడీ...?