Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా...?' కానీ 1.4 కోట్ల మందికి ఎయిడ్స్... బాంబు పేల్చిన WHO

ఎయిడ్స్ అవగాహనా సదస్సులు, ప్రజల్లో ఆ వ్యాధిపై అవగాహన తెచ్చేందుకు అప్పట్లో 'పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా' అంటూ ప్రకటనలు గుప్పించారు. అప్పట్లో ఎక్కడ చూసినా అదే ప్రకటన కనబడుతుండేది. ఇకపోతే డిసెంబరు 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బ

'పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా...?' కానీ 1.4 కోట్ల మందికి ఎయిడ్స్... బాంబు పేల్చిన WHO
, బుధవారం, 30 నవంబరు 2016 (14:47 IST)
ఎయిడ్స్ అవగాహనా సదస్సులు, ప్రజల్లో ఆ వ్యాధిపై అవగాహన తెచ్చేందుకు అప్పట్లో 'పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా' అంటూ ప్రకటనలు గుప్పించారు. అప్పట్లో ఎక్కడ చూసినా అదే ప్రకటన కనబడుతుండేది. ఇకపోతే డిసెంబరు 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బాంబు లాంటి వార్తను తెలిపింది. అదేమంటే ప్రపంచ వ్యాప్తంగా కోటీ 40 లక్షల మందికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు తమ గణాంకాలు చెపుతున్నాయనీ, ఐతే వ్యాధిగ్రస్తులకు సైతం ఆ వ్యాధి తమకు ఉన్నదన్న విషయం తెలియదని పేర్కొంది. 2015 లెక్కల ప్రకారం పరిస్థితి ఇలా ఉందని తెలియజేసింది. 
 
కాబట్టి సురక్షితము కానీ సెక్స్ క్రియలో పాల్గొనేవారు తమను తాము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. నోటి లాలాజలం లేదా చేతి వేలి నుంచి కాస్త రక్తాన్ని సేకరించి పరీక్ష చేయిస్తే ఫలితం తెలుసుకోవచ్చని తెలిపింది. హెచ్ఐవి పాజిటివ్ లేదా నెగటివ్ ఫలితాలను తెలుసుకునేందుకు ఎవరికివారు కిట్లు కొనుగోలు చేసుకోవాలని సూచన చేసింది. తమ లెక్కల ప్రకారం హోమో సెక్సువల్స్.... మగ - మగ సెక్స్ క్రియ వల్ల అధికంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నట్లు తేలిందని తెలియజేసింది. 
 
ఇక భారతదేశం విషయానికి వస్తే... 2015 సంవత్సరంలో భారతదేశంలో 1.96 లక్షల మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు నిర్థారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఈ సంఖ్య 376 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఎయిడ్స్ వ్యాధి కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీనికి కారణం వ్యాధి గురించి ప్రజల్లో అవగాహనం పెరగడమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేటీఎంకు హ్యాకర్ల బెడ‌ద‌... ఆన్‌లైన్ పేమెంట్ల‌కు భ‌ద్ర‌త ఎక్క‌డ‌?