Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేషాచలం ఎన్‌కౌంటర్‌కు సరిగ్గా రెండు సంవత్సరాలు.. కొలిక్కి రాని కేసు..?

విలువైన సంపద దోచుకుపోతున్నారన్న ఆవేదన ఒకవైపు. మానవ హక్కులను హరించివేశారన్న ప్రజాస్వామ్య విలువలు మరోవైపు. తప్పుఒప్పులు రెండూ ఉండడం సహజం. కానీ సంధర్భాన్ని బట్టి ఒకచోట తప్పు అనుకున్నది మరోచోట ఒప్పు అవుతుంది. అది వారి వారి విచక్షణా జ్ఞానంపై ఆధారపడి ఉంటుం

Advertiesment
శేషాచలం ఎన్‌కౌంటర్‌కు సరిగ్గా రెండు సంవత్సరాలు.. కొలిక్కి రాని కేసు..?
, శనివారం, 8 ఏప్రియల్ 2017 (15:42 IST)
విలువైన సంపద దోచుకుపోతున్నారన్న ఆవేదన ఒకవైపు. మానవ హక్కులను హరించివేశారన్న ప్రజాస్వామ్య విలువలు మరోవైపు. తప్పుఒప్పులు రెండూ ఉండడం సహజం. కానీ సంధర్భాన్ని బట్టి ఒకచోట తప్పు అనుకున్నది మరోచోట ఒప్పు అవుతుంది. అది వారి వారి విచక్షణా జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. చట్టం ఏం చెబుతుంది అని ఆలోచించే లోపే విజ్ఞతతో వ్యవహరించారని మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ జరిగిందని నేరమా..? ఇంతకుముందు చేసింది నేరమా..? నేరము..శిక్ష?  
 
ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన జాతి సంపద ఆంధ్రప్రదేశ్‌ సొంతం. శేషాచల కొండల సాక్షిగా కోట్లు విలువచేసే ఎర్రబంగారం ఏపుగా పెరుగుతోంది. కానీ దానిని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం మాత్రం తరచూ విఫలమవుతోంది. ఒకవైపు చట్టాలు కఠినంగా ఉన్నాయంటూ ఫారెస్ట్ అధికారులు ఏవేవో చెబుతున్నా పట్టుకున్న వారిని శిక్షించలేనంత చౌకబారు సెక్షన్లు ఉన్నాయంటున్నారు మరోవైపు పోలీసు అధికారులు. ఇలాంటి సందిగ్ధత నడుమే దశాబ్ధాలుగా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. పట్టుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ దొరికన వారిని కఠినంగా శిక్షించిన దాఖలాలు ఎక్కడా లేవు. 
 
ఇందులో నాయకుల చిత్తశుద్ధి లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోకే విలువైన సంపదను ఎర్రచందనాన్ని పాలిస్తున్న ఇవే ప్రభుత్వాలు వాటిని కాపాడుకోవడానికి కఠిన చట్టాలు ఎందుకు తావు అన్నది అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. కానీ వీటిన్నంటికి సమాధానాలు దొరికేలోపే 20మంది ప్రాణాలు నిట్టనిలువునా తీసేశారు. ధర్మయుద్థమని ఒకరంటే..అధర్మరంగా వ్యవహరించారని మరొకరు ఆరోపించారు. ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం దేనిగురించి అనుకుంటున్నారా.. సరిగ్గా రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ఎర్రచందనం ఎన్ కౌంటర్ గురించి. రెండేళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కేసులో న్యాయా న్యాయాలు తేలడం లేదు. పోలీసుల తీరు పట్ల విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. శబాష్‌..అద్భుతంగా చేశారంటూ ఒకవైపు ప్రభుత్వం అదే పోలీసులను అభినందిస్తుంటే..మరోవైపు మనిషి ప్రాణమంటే విలువలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు సామాజిక కార్యకర్తలు. కానీ వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని తప్పుఒప్పులను తేల్చాల్సిన కోర్టులు ఇంకా తుదితీర్పును వెలువరించనేలేదు. 
 
ఎంతో కాలంగా శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న మాట వాస్తవమే. దీనిని కట్టడి చేయడానికి అప్పట్లో ప్రభుత్వాలు పెద్దగా చొరవ చూపలేదన్న మాట వాస్తవం. రాష్ట్రంలో జరిగే ఏ ఇల్లీగల్ పనుల్లోనైనా పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. అందుకు ఎర్రచందనం స్మగ్లింగ్ ఏమీ అతీతం కాదు. ఇందులోను అనేకమంది నాయకులపైన ఆరోపణలు ఉన్నాయి. అయితే కిరణ్‌ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేయడం కోసం కొన్ని కఠినచర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగించగా డిఐజి స్థాయి వ్యక్తిని టాస్క్ ఫోర్స్ కు అధిపతిని చేశారు. అప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల ఏరివేత మొదలైంది. 
 
శేషాచలం అడవుల్లో ఎక్కడ అలజడి రేగినా టక్కున వాలిపోయే వారు పోలీసులు. అలా కొన్ని వందలమంది కూలీలను పట్టుకున్నారు. వేల కోట్ల విలువచేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత హడావిడి  జరుగుతున్న స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. టాస్క్ ఫోర్స్ తన రెండో ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టింది. ఎవరైతే కూలీలు అడవిలోకి వస్తున్నారో..స్వయంగా వారి గ్రామాలకు వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నమే చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. స్మగ్లర్ల గుండెల్లో భయం పుట్టిస్తే తప్ప దీన్ని అరికట్టలేమన్న ఆలోచన టాస్క్ ఫోర్స్ వచ్చిన ఐడియా ఫలితమే 20మంది ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్. 
 
అయితే ఈ పోలీసులు నిజంగా చేసింది ఎన్ కౌంటర్ కాదని, పట్టుకొచ్చి కాల్చి చంపారంటూ అప్పట్లో ప్రజాసంఘాలు కోడై కూశాయి. కోర్టులను కూడా ఆశ్రయించాయి. ఆ కేసులు ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు చాలా అన్యాయంగా బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నాయంటూ ప్రజాసంఘాలు ఆరోపణలతో సరిపెట్టుకోలేదు. నిజంగానే కోర్టుల్లో తేల్చుకుందామంటూ ముందుకు వెళుతున్నారు. వాటికి కావాల్సిన సాక్షాధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

ఇప్పటికే పుత్తూరు దగ్గర దొరికిన ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకొని మరీ కాల్చిచంపారంటూ ప్రత్యక్షంగా చూసిన కొంతమంది సాక్షులను సిద్థం చేసిపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్ కౌంటర్ జరిగినప్పుడు ఈ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో వచ్చేనెల రాబోయే తుదితీర్పు కూడా అంతే సంచలనంగా మారనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్... గాలి తీయొద్దు... టిటిడి ఛైర్మన్ ఇస్తాగా...? ఎవరు..?