Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేఖర్‌ రెడ్డి వెనుక తితిదే ఉన్నతాధికారి?

గుట్టలు గుట్టలుగా నోట్లు, బంగారం కలిగి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పట్టుబడిన తితిదే పాలకమండలి బహిష్కృత సభ్యుడు శేఖర్‌రెడ్డి తనకు సహకరించిన వారిలో తితిదేకి చెందిన ఒక ఉన్నతాధికారి పేరు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన సహకారంతో విశాఖపట్నంలో కొంత నగదు మార్చు

Advertiesment
Sekhar Reddy Case
, శనివారం, 24 డిశెంబరు 2016 (14:40 IST)
గుట్టలు గుట్టలుగా నోట్లు, బంగారం కలిగి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పట్టుబడిన తితిదే పాలకమండలి బహిష్కృత సభ్యుడు శేఖర్‌రెడ్డి తనకు సహకరించిన వారిలో తితిదేకి చెందిన ఒక ఉన్నతాధికారి పేరు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన సహకారంతో విశాఖపట్నంలో కొంత నగదు మార్చుకున్నానని శేఖర్‌ రెడ్డి వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఈ కేసు తితిదేలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది? శేఖర్‌ రెడ్డితో ఉన్న సంబంధాలు ఇక్కడి అధికారుల మెడకు చుట్టుకోబోతోందా?
 
తమిళనాడుకు చెందిన శేఖర్‌ రెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు 170కోట్ల నగదు, 127కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నగదులో 34కోట్లు కొత్త 2వేలు ఉండడం దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. శేఖర్‌ రెడ్డి కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని సిబిఐకి అప్పగించారు. ఇప్పటికే ఆయనకు సహకరించిన బ్యాంకర్లు, ఇతర అధికారులపైన విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే అరెస్టు అయిన శేఖర్‌ రెడ్డి..తితిదేకి చెందిన కీలకమైన అధికారి పేరు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది.
 
తమిళనాడుతో సంబంధాలు ఉన్న ఆ అధికారి తనకు విశాఖపట్నంలో పాత డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకర్ల ద్వారా సహకరించారని శేఖర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. తితిదే పాలకమండలి శేఖర్‌ రెడ్డికి ఇక్కడి అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సాన్నిహిత్యంతోనే ఒక అధికారి తన పలుకుబడిని ఉపయోగించి శేఖర్‌ రెడ్డికి సాయం చేసినట్లు చెబుతున్నారు. 
 
ఇప్పటిదాకా కేసును ఐటి అధికారులే చూస్తూ వచ్చారు. అందువల్ల శేఖర్‌ రెడ్డి చెప్పిన పేరును పెద్దగా పట్టించుకు ఉండకపోవచ్చు. ఈ అక్రమాల్లో చాలామంది పాత్ర ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తు ఆషామాషీగా ఉండదు. చాలా లోతుల్లోకి వెళుతుంది. అత్యంత చుర్గుగాను సాగుతుంది. నిందితులు చెప్పే  ఏ విషయాన్ని కూడా సిబిఐ విడిచిపెట్టదు. కేంద్ర ప్రభుత్వమే ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. అందువల్ల సిబిఐ మరింత ఉత్సాహంగా దర్యాప్తు చేసే అవకాశముంది.
 
ఈ కేసు విచారణ లోతుల్లోకి వెళ్ళే కొద్దీ శేఖర్‌ రెడ్డికి సహకరించిన తితిదే అధికారిని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ అధికారికి, శేఖర్‌ రెడ్డ ఉన్న సంబంధాల గురించి మొదట్లోనే మీడియాలోను కథనాలు వచ్చాయి. శేఖర్ రెడ్డి కేసు నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావునూ విడిచిపెట్టలేదు. ఆయన ఇళ్ళపై ఐటీ దాడులు నిర్వహించింది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే శేఖర్ రెడ్డి కేసులో చాలామంది పెద్దల పేర్లు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందులో తితిదే అధికారి పేరు ఉంటుందా.. లేదో..వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రైస్తవుల అభ్యున్నతే లక్ష్యంగా ఏపీ సర్కార్... జెరూసలెం యాత్రకు రూ. 5 కోట్ల నిధులు