Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ కార్యసాధకురాలా? డీఎంకే - కాంగ్రెస్ - బీజేపీ - దీప వ్యూహాలను తట్టుకుంటారా..!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా తమిళనాడు రాజకీయాలేనే చర్చ సాగుతోంది. డిసెంబర్ 5వతేదీ జయలలిత మరణించిన తర్వాత ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారుతూ వచ్చాయి. పేరుకే ఓ.పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్

శశికళ కార్యసాధకురాలా? డీఎంకే - కాంగ్రెస్ - బీజేపీ - దీప వ్యూహాలను తట్టుకుంటారా..!
, సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (11:04 IST)
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా తమిళనాడు రాజకీయాలేనే చర్చ సాగుతోంది. డిసెంబర్ 5వతేదీ జయలలిత మరణించిన తర్వాత ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారుతూ వచ్చాయి. పేరుకే ఓ.పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ తర్వాత చాపకిందనీరులా పదవి కోసం శశికళ చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. శాసనాసభ పక్షనేతగా ఎన్నికైన శశికళ చివరకు సీఎం కాబోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా రాజకీయాలపై కనీస పరిజ్ఞానం లేని శశికళ అసలు ఏ విధంగా ముందుకు వెళతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం 3వ తరగతి మాత్రమే చదుకుని వీడియో గ్రాఫర్‌‌గా పనిచేసిన శశికళ చివరకు సీఎం స్థాయికి ఎదుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఆమె సిఎం అయిన తర్వాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కోకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
శశికళ. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగినా వినిపించే పేరు. సరిగ్గా 2 నెలల తర్వాత అన్నాడీఎంకేకు శాసనాసభ పక్షనేతగా ఎన్నికై ఉన్న ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆమే ముఖ్యమంత్రి అయిపోతున్నారు. అది మరి శశికళ గొప్పతనం. 30 సంవత్సరాల పాటు జయలలితతో సన్నిహితంగా ఉన్న శశికళకు చివరకు అన్నాడిఎంకే నేతలు పట్టంకట్టారు. అది కూడా ముఖ్యమంత్రి పట్టమే. అయితే ఇక్కడ శశికళకు ఎన్నో విమర్శలు ఉన్నాయి. అదే రాజకీయంలో ఆమె ఏ విధంగా ముందుకు వెళతారన్నది. ఒకవైపు విద్యాబ్యాసం లేదు.. మరోవైపు రాజకీయ చతురత లేదు. రెండింటి మధ్య బలమైన ప్రతిపక్షం.. అందులోను జయలలిత వారసురాలిని నేనేనంటూ అందరిని కలుపుకుని వెళుతున్న దీప.. ఇలా ఒకటి కాదు ఎన్నో గండాలు శశికళ ముందున్నాయి.
 
శశికళ రేపు, మాపో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా ప్రభుత్వాన్ని కూలదోసే పనిలో నిమగ్నమయ్యారు డిఎంకే నేతలు. ఇప్పటికే స్టాలిన్ శశికళ సిఎం అవుతుండటంపై తీవ్రంగా స్పందించారు. తమిళ ప్రజలు జయలలిత ఇంట్లో వారికి ఓటెయ్యలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు దీప కూడా శశికళను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అన్నాడిఎంకే నేతల్లో శశికళ అంటే పడని వారిని తనవైపు తిప్పుకుంటున్నారు.
 
ఇక మరోవైపు పన్నీర్ సెల్వం కూడా పార్టీ మారిపోయే పరిస్థితులు లేకపోలేదు. ఇప్పటికే తీవ్ర పరాభవంతో ఉన్న పన్నీరుసెల్వంకు అన్నాడీఎంకే నేతలతో పాటు డీఎంకే నేతలు ఇచ్చిన పేరు ఉత్సవ విగ్రహం. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న పన్నీర్ సెల్వం దీపతో జతకడతారని ఇప్పటికే తమిళనాడులో వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో శశికళకు సీఎం పదవి నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
అనుకున్నంత ఈజీ కాదు సీఎం పదవి అంటే. శశికళ అలాంటి వ్యక్తి ఏ విధంగానూ ఆ పదవిలో కూర్చుని ప్రజా సమస్యలను పరిష్కరించలేరంటున్నారు. కేవలం 30 సంవత్సరాల అంత:పురంలో జయలలితతో ఉన్న శశికళకు రాజకీయాలు వంటపట్టాలంటే సాధ్యం కాదని పంటున్నారు రాజీకయ విశ్లేషకులు. మరి శశికళ ఎలాంటి వ్యూహంలో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేశారనీ ఓ బాలిక బలన్మరణం