Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ వ్యూహాలకు పార్టీ నేతలు బెంబేలు... వీరవిధేయతను చూపిన పన్నీర్ సెల్వం

ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రియనెచ్చెలిగా ఉన్న శశికళ.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె రచిస్తున్న వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులకు పార్టీ నేతలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎవరికీ రవ్వంత

Advertiesment
శశికళ వ్యూహాలకు పార్టీ నేతలు బెంబేలు... వీరవిధేయతను చూపిన పన్నీర్ సెల్వం
, ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (16:51 IST)
ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రియనెచ్చెలిగా ఉన్న శశికళ.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె రచిస్తున్న వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులకు పార్టీ నేతలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎవరికీ రవ్వంత హాని కలుగకుండా తన కార్యాలయను చక్కబెట్టుకుంటున్నారు. తద్వారా జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని తన చేతల ద్వారా నిరూపించుకుంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బేరీజు వేస్తే ఇదే విషయం అవగతమవుతుంది. తొలుత పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోనున్నారు. ఇందుకోసం ఆమె చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. సీఎం బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌ సెల్వం తాను ఒక ముఖ్యమంత్రిని అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోలేకపోవడం, పార్టీ బాధ్యతలు, ముఖ్యమంత్రి బాధ్యతలు ఒక్కరికే ఉండాలనే సంప్రదాయం అన్నాడీఎంకేలో ఉండటం శశికళకు బాగా కలిసొచ్చాయి. ఈ రెండు అంశాలను అడ్డుపెట్టుకుని శశికళ తన వ్యూహాలకు పదునుపెట్టి.. తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నారు. 
 
మరోవైపు.. గతంలో ముఖ్యమంత్రి జయలలితకు ఉన్నట్లుగానే శశికళకు కూడా పన్నీర్‌ సెల్వం అత్యంత విశ్వసనీయంగా ఉండేందుకే ప్రయత్నించారే తప్ప తన మంత్రి వర్గంలోవారిని ఆకట్టుకోవడం, ప్రజలను తన వైపునకు తిప్పుకోవడం వంటి చర్యలు చేయలేదు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శశికళ మీడియాతో ముందుకు రాకుండానే, గందరగోళ పరిస్థితులు ఉత్పన్నంకాకుండానే తన చుట్టూ ప్రశాంత వాతావరణం ఏర్పాటుచేసుకొని చాపకింద నీరులాగా తన వ్యూహాన్ని అమలుచేయించి తన మార్క్‌ శశికళ చూపించిందనే చెప్పాలి.
webdunia
 
గత రెండు నెలలుగా స్తబ్ధంగా ఉన్నప్పటికీ ఈ రెండు నెలలు ఆమె క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతికూలతను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే చర్యలకు దిగినట్లు సమాచారం. మొత్తానికి తాజా నాటకీయ పరిణామంతో శశికళ అన్నా డీఎంకే పార్టీని, పార్టీ నేతలను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లపాటు జయలలితతో శశికళ సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయ ఆలోచనలే శశి కూడా అమలుచేస్తుంది పార్టీ శ్రేణులు ప్రజలు కూడా భావిస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్ సెల్వం హ్యాట్రిక్ రాజీనామాలు.. తమిళనాడు సీఎంగా 7న శశికళ ప్రమాణం