Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ ఇక జైలుపక్షే... కేసుపై కేసు : 'మన్నార్గుడి మాఫియా'పై టార్గెట్ పెట్టిన నేత!

తమినాడు రాష్ట్రంలో మన్నార్గుడి మాఫియాపై ఓ నేత టార్గెట్ పెట్టారు. ఈ మాఫియా ముఠాకు చెందిన వారెవ్వరూ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే ఆయన పావులు కదుపుతున్నారు.

శశికళ ఇక జైలుపక్షే... కేసుపై కేసు : 'మన్నార్గుడి మాఫియా'పై టార్గెట్ పెట్టిన నేత!
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (19:04 IST)
తమినాడు రాష్ట్రంలో మన్నార్గుడి మాఫియాపై ఓ నేత టార్గెట్ పెట్టారు. ఈ మాఫియా ముఠాకు చెందిన వారెవ్వరూ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే ఆయన పావులు కదుపుతున్నారు. ఆ నేత ఎవరో కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశంలో అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇందుకోసం డీమోనిటైజేషన్ పేరుతో దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. 
 
ఇంతలో అన్నాడీఎంకే అధినేత్రిగానూ, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మృతి చెందారు. ఆమె స్థానంలో ఆమె స్నేహితురాలు శశికళ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని భావించి, ఆ దిశగా ఆమె నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, దక్షిణ భారతదేశంలో తమిళనాడు వంటి అతిపెద్ద రాష్ట్రం ఓ మాఫియా చేతిలోకి వెళ్ళడాన్ని ప్రధాని మోడీ సహించలేక పోయారు.
 
ఇంతలో జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శశికళ దూకుకుడు బ్రేక్ పడింది. ఫలితంగా ఆమె అసెంబ్లీకి కాకుండా బెంగుళూరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. అయితే, జైలు నుంచే పార్టీని, సర్కారును శాసిస్తున్నారనే విషయం తెలిసింది. దీనికి ఎలా బ్రేక్ వేయాలన్న అంశంపై తర్జనభర్జన చెందిన మోడీ... ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ఢిల్లీకి పిలిపించారు. ఆయనకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చేందుకే హస్తినకు పిలిపించారని కొందరు నేతలు చెపుతున్నారు. 
 
మరోవైపు శశికళతో పాటు మన్నార్గుడి మాఫియాపై ఉన్న ఫెరా, విదేశీ కారు దిగుమతి, తదితర కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు ఆదేశాలు వెళ్లాయి. ఈ కారణంగా మన్నార్గుడి మాఫియాపై ఉన్న కేసుల విచారణ ఇకపై ప్రతి వారం చెన్నై మేజిస్ట్రేట్ కోర్టులో జరుగనుంది. ఈ కేసులను వీలైంత త్వరగా పూర్తి చేసి.. తీర్పును రిజర్వులో ఉంచేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. మన్నార్గుడి మాఫియాకు చెందిన వారు తోక ఆడించినపుడు.. ఈ కేసుల అస్త్రాలను ప్రయోగించి తద్వారా ముందరకాళ్లకు బంధం వేయాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహంగా ఉంది. మొత్తంమీద శశికళతో పాటు మన్నార్గుడి మాఫియా ముఠాకు చెందిన సభ్యులు అధికారంలోకి రాకూడదన్న బలమైన సంకల్పంతో ఆయన ఉన్నారని చెప్పొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యుడి లోగుట్టుపై అధ్యయనం : నాసా స్టేట్మెంట్... ఎలాగంటారా?