Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్గోపై కేశినేని దృష్టి - కేశినేని ట్రావెల్స్‌ను ఎందుకు మూసేశారో తెలుసా..?

ఇన్నిరోజులు నష్టాల్లో లేనిది... ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిందట. ఉన్నఫళంగా బోర్డు ఎత్తేసిన కేశినేని ట్రావెల్స్ పరిస్థితి ఇది. విజయవాడలో రారాజులో ఉంటూ కొన్నేళ్లుగా ట్రావెల్స్‌ను నడుపుతున్న కేశినేని నాని ఒక

కార్గోపై కేశినేని దృష్టి - కేశినేని ట్రావెల్స్‌ను ఎందుకు మూసేశారో తెలుసా..?
, ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (14:37 IST)
ఇన్నిరోజులు నష్టాల్లో లేనిది... ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిందట. ఉన్నఫళంగా బోర్డు ఎత్తేసిన కేశినేని ట్రావెల్స్ పరిస్థితి ఇది. విజయవాడలో రారాజులో ఉంటూ కొన్నేళ్లుగా ట్రావెల్స్‌ను నడుపుతున్న కేశినేని నాని ఒక్కసారిగా తన ట్రావెల్స్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాజకీయ పార్టీ నేతలందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల రాజకీయ నేతలందరూ కేశినేని నిర్ణయంపై ఆశక్తిగా ఎదురు చూశారు. చిన్న వ్యవహారంపై కోట్ల రూపాయల రాబడి వచ్చే ట్రావెల్స్‌ను కేశినేని మూసేయడం ఏమిటో అర్థంకాక తలలు పీక్కుంటున్నారు నేతలు.
 
ప్రైవేటు ట్రావెల్స్‌లో కేశినేని ట్రావెల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వందలాదిమంది ఉద్యోగులు కూడా ఉన్నారు. అంతేకాదు లాభాలు కూడా అదేస్థాయిలో వస్తున్నాయి. కానీ గత కొన్నిరోజుల క్రితం కేశినేని ట్రావెల్స్‍‌కు సంబంధించిన బస్సు ప్రమాదానికి గురై ఆర్టీవోతో గొడవకు దిగారు కేశినేని నాని వర్గీయులు. ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. అప్పట్లో ఆయన కేశినేని నానిని పిలిచి మందలించారు. సాధారణంగానే కేశినేనిని మందలించినా ఆయన మాత్రం దాన్ని బాగా సీరియస్‌గా తీసుకున్నారు. డబ్బులు వస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ట్రావెల్స్‌ను మూసేస్తున్నట్లు నిర్ణయించేసున్నారు. 
 
సుమారు 6 రాష్ట్రాల్లో ఉన్న ఈ ట్రావెల్స్‌ను ఎత్తేసిన కేశినేని ఆ తర్వాత బస్సులను విక్రయించడానికి సిద్ధమైపోయారు. అధినేత చంద్రబాబుకు అత్యంత దగ్గరగా ఉండటం, నేతలందరూ అమరావతిలోనే ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా విమర్శలు రాకూడదన్న ఉద్దేశంతోనే కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంచితే కార్గో వైపు ప్రస్తుతం కేశినేని నాని అడుగులు వేస్తున్నారట. ట్రావెల్స్‌లో ఉన్న ఉద్యోగులందరినీ ఇందులోకి తీసుకుని వారికి జీవనోపాధి కల్పించాలన్నదే ఆయన ఉద్దేశమట. మరి వేచిచూడాలి ఈ సంస్థ అయినా ఎన్ని రోజుల పాటు ఉంటుందో. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెండకాయ కూరేనా అంటూ భర్త వాగ్వివాదం.. పురుగుల మందు తాగేసిన వివాహిత