Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజా దర్బార్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌లో పవన్ ప్రస్తావిస్తారా? అబ్బా డైలాగ్ అతికినట్టు లేదే? ఫ్యాన్స్ నిరాశ

అనంతపురంలో గురువారం బహిరంగ సభను పెట్టి.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపారేసిన జనసేన అధినేత, గబ్బర్ సింగ్ హీరో పవన్ కల్యాణ్.. ఆ సభాముఖంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. అసెంబ్లీల

ప్రజా దర్బార్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌లో పవన్ ప్రస్తావిస్తారా? అబ్బా డైలాగ్ అతికినట్టు లేదే? ఫ్యాన్స్ నిరాశ
, శనివారం, 12 నవంబరు 2016 (10:20 IST)
అనంతపురంలో గురువారం బహిరంగ సభను పెట్టి.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపారేసిన జనసేన అధినేత, గబ్బర్ సింగ్ హీరో పవన్ కల్యాణ్.. ఆ సభాముఖంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమైపోయింది. అనంత సభ ముగిశాక శుక్రవారం గుత్తి గేట్స్ విద్యార్థులతో పెట్టుకున్న ముఖాముఖి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
 
అయితే ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నకు పవన్ తికమకపడ్డారు. పవన్‌కైతే ఇదో మేధో కసరత్తుగా మాత్రం బాగా ఉపయోగపడింది. అచ్చుగుద్దినట్లు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలాగే సాగిన గుత్తి క్వశ్చన్ అవర్‌ని పరిశీలించిన వారు ఏం చెప్తున్నారంటే.. విద్యార్థులు అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఎస్ ఆర్ నో అన్నట్లు సమాధానం ఇచ్చారంటున్నారు. స్టూడెంట్స్ సూటిగా.. సిన్సియర్‌గా అడిగిన ప్రతి ప్రశ్నకూ జనసేన చీఫ్ నుంచి ఒక్క స్పష్టమైన సమాధానం కూడా రాలేదు. 
 
ఇందులో భాగంగా కుల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లతో మెరిట్‌కు అన్యాయం జరుగుతోంది కదా.. మీరేమంటారు అనే ప్రశ్నకు? ఇప్పుడు నేనేమన్నా ఈకలు పీకుతారంటూ ఎస్కేప్ అయ్యారు. మా కరవు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి సార్.. అంటూ రిక్వెస్ట్ చేసుకుంటే.. ఒక్క ఊరేంటి..? నాకున్న కమిట్ మెంట్‌కి మొత్తం అనంత జిల్లానే దత్తత తీసుకోవచ్చంటూ శ్రీమంతుడు డైలాగు చెప్పేశారు.
 
ఇలా విద్యార్థులు మార్చి మార్చి ప్రశ్నలేయడంతో.. పవన్ యాన్సర్ చెప్పడంలో పరిమితంగా ఉండిపోయారు. చివరిగా మీరడిగిన ప్రశ్నలను గుర్తుపెట్టుకుని రేపటి రోజున ప్రజాదర్బార్‌లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రస్తావిస్తానంటూ పోడియం దిగివెళ్లిపోవడం పవర్ స్టార్‌కు అంతగా అతికినట్లు లేదంటూ అభిమానులే నిరాశపడినట్లు వార్తలొస్తున్నాయి. రాజకీయ నేతగా ఎదగాలంటే మంచి స్పీచ్ ఇవ్వాలని.. ప్రజలు అడిగే ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పేలా ఉండాలని.. తమ హీరో పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ రద్దు.. తెలంగాణపై తీవ్ర ప్రభావం.. ఆదాయానికి గండి.. గవర్నర్‌తో కేసీఆర్ ఆవేదన