చిరంజీవి ప్రజారాజ్యం... డిట్టో పవన్ కళ్యాణ్ జనసేననా? ఎందుకు ఈ అనుమానం?
విజయవాడ : అన్నయ్య బాటలోనే తమ్ముడు పయనిస్తున్నాడా? ఆరంభ సూరత్వంతో పార్టీ ప్రారంభమై... ఎన్నికల సమయానికల్లా తుస్సుమంటుందా? జనసేనపై రాజకీయ పరిశీలకుల అంచనాలివి. ప్రజారాజ్యం... అంటూ చిరంజీవి తిరుపతిలో తన పార్టీని అశేష జనసంద్రం మధ్
విజయవాడ : అన్నయ్య బాటలోనే తమ్ముడు పయనిస్తున్నాడా? ఆరంభ సూరత్వంతో పార్టీ ప్రారంభమై... ఎన్నికల సమయానికల్లా తుస్సుమంటుందా? జనసేనపై రాజకీయ పరిశీలకుల అంచనాలివి. ప్రజారాజ్యం... అంటూ చిరంజీవి తిరుపతిలో తన పార్టీని అశేష జనసంద్రం మధ్య ప్రకటించారు. అప్పుడు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం మొదలైంది.
ఆ పార్టీలోకి మారిపోవాలని, ఆ పార్టీ టిక్కెట్ దొరికితే, ఇక విజయం నల్లేరు మీద నడక అని బడా నేతల నుంచి, చోటా నేతల వరకు భావించారు. పార్టీ ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం బేరసారాలు ప్రారంభించారు. తీరా ఎన్నికల్లో చిరంజీవి పార్టీ తుస్సుమంది. టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలను చిరంజీవి అండ్ కో మూటకట్టుకుంది.
ఇపుడూ...అదే సీన్ రిపీట్ అవుతోంది... పవన్ కల్యాణ్ వస్తే, ఆయన జనసేనలో చేరిపోదామని పలువురు నేతలు ఇప్పటి నుంచే కలలుగంటున్నారు. అత్తారింటికి దారేదంటూ... పవన్ కల్యాణ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలని ఎంక్వయిరీలు చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కింద టీడీపీలోకి చేరాలనుకునే పెద్దలూ.. ఇపుడు పవన్ బహిరంగ సభతో ఆలోచనలో పడుతున్నారు. మరోపక్క చిరంజీవిలా పవన్ కల్యాణ్ కూడా ప్రజాయాత్రలతో పార్టీని స్టార్ట్ చేస్తుండటంతో ఈ ఊపు... ఆ ఊపు ఒకటే అవుతుందా...అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.