Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓపీఎస్‌కు మోడీ పిలుపు.. సీఎం రేసులో రజనీకి పోటీ? బీజేపీలో చేరమంటారా?

తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాడులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో చీలికలు.. పళని- ఓపీఎస్ వర్గాల పోరు జరుగుతోంది. మరోవైపు తమిళ సూప

Advertiesment
ఓపీఎస్‌కు మోడీ పిలుపు.. సీఎం రేసులో రజనీకి పోటీ? బీజేపీలో చేరమంటారా?
, శుక్రవారం, 19 మే 2017 (17:08 IST)
తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాడులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో చీలికలు.. పళని- ఓపీఎస్ వర్గాల పోరు జరుగుతోంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాలపై రజనీ మాట్లాడటం ద్వారా రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇవ్వడంతో బీజేపీ వెన్నులో వణుకు మొదలైంది. 
 
రజనీకాంత్ సొంత కుంపటి పెట్టుకుంటే.. ఇక తమిళనాట బీజేపీకి ఏమాత్రం క్రేజ్ దొరకదని భావించిన బీజేపీ అధిష్టానం అతివేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓపీఎస్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం తనను కలవాల్సిందిగా ఫోన్‌లో చెప్పారు. దీంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై తిరుగుబాటుకు రంగం సిద్ధమైంది. రహస్యభేటీలు మంతనాలతో ఎమ్మెల్యేలు బిజీగా మారిపోయారు. ప్రధాని మోదీ, పన్నీర్ సెల్వానికి మద్దతివ్వడం ఖాయమని తేలిపోయిన తరుణంలో దళిత వర్గానికి చెందిన 13మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు.
 
అయితే, గతంలో పళని స్వామి వర్గం రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికే మద్ధతునిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలోనే తనని కలవాల్సిందిగా మోడీ అభ్యర్థించారు. అందుకే అపాయింట్‌మెంట్ ఇచ్చారని టాక్. ఇటీవల ఏపీ విపక్ష నేత జగన్ కూడా ప్రధానిని కలిసి రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలోనే ఓపీఎస్‌తో మోదీ భేటీ కూడా వుంటుందని రాజకీయ పండితులు అంటున్నారు.

ఓపీఎస్‌కు బీజేపీ మద్దతిస్తుందని హామీ ఇచ్చి.. బీజేపీలోకి చేరమని మోడీ ఓపీఎస్‌ను కోరుతారని తెలుస్తోంది. ఇలా వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఓపీఎస్‌ను చేస్తే రజనీకి పోటీగా మారుతారని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా, రజనీకి వున్న క్రేజ్‌ ముందు ఓపీఎస్ కూడా పడిపోకతప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఓపీఎస్‌తో మోడీ భేటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఐ తనిఖీల దెబ్బ : లండన్‌కు చిదంబరం కొడుకు... అరెస్టు భయమా?