Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ ఎన్టీఆర్‌కు చినబాబు పూర్తిగా గేట్లు మూసేశారా..? తాత తెదేపాలో మనవడికి చోటు దక్కదా?

ఆవేశపూరితంగానే కాకుండా సందర్భోచితంగానూ ప్రసంగాలు చేయడంలో తాతకు తగ్గ మనవడుగా గుర్తించబడ్డ నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెదేపాలో చోటు కావాలంటే సినిమాలు మానేసి, పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావ

జూనియర్ ఎన్టీఆర్‌కు చినబాబు పూర్తిగా గేట్లు మూసేశారా..? తాత తెదేపాలో మనవడికి చోటు దక్కదా?
, గురువారం, 11 మే 2017 (18:47 IST)
ఆవేశపూరితంగానే కాకుండా సందర్భోచితంగానూ ప్రసంగాలు చేయడంలో తాతకు తగ్గ మనవడుగా గుర్తించబడ్డ నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెదేపాలో చోటు కావాలంటే సినిమాలు మానేసి, పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావలసిందే అంటున్నారు చినబాబు లోకేశ్.
 
ఆంధ్రరాష్ట్ర విభజన నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనల జ్వాలలో అప్పటి పాలక పార్టీ కాంగ్రెస్ మట్టికరవడం, జనసేన అంటూ పైజామా లాల్చీలతోపాటు గడ్డం పెంచిన పవన్ మద్దతు, అక్రమాస్తుల కేసులలో జగన్... ఇవన్నీ కలగలిపి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదం చేసాయని ప్రతి ఒక్కరూ ఒప్పుకునే విషయం. 
 
కానీ ఇవేవీ లేని 2009 ఎన్నికల్లో, ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి సునామీ సృష్టిస్తారని ఊహాగానాలు జరిగేటప్పుడు సైతం తెదేపా ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని తేదేపాలోని సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అప్పుడు పార్టీ అధికారం చేపట్టలేకపోయినప్పటికీ, ఎన్టీఆర్ చేసిన సాయం మరువకూడదనేది వారి వాదన.
 
అసలు పార్ట్ టైమర్లకు చోటు లేదంటే... మరి చినబాబుకి స్వయానా మేనమామ, పిల్లనిచ్చిన బాలకృష్ణ సంగతేంటని పార్టీలోని మరో వర్గం ప్రశ్నిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రజలు బాలయ్య తమ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాజకీయ అవసరార్థం ఎప్పటికప్పుడు తెరపై నటులను రాజకీయ వేదికల మీద ప్రత్యక్షం చేయించే తెదేపా వ్యవస్థాపకుడు సైతం ఒకప్పుడు ముఖానికి రంగేసుకున్న నటుడేనని, ఆయన కూడా సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లోనూ చక్రం తిప్పారని చినబాబు మరిచిపోయారేమో మరి. 
 
తెలుగుదేశం పార్టీలో నందమూరి ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించి, నారావారు తమదైన ముద్ర వేసేందుకు సమాయత్తమవుతున్నారు. అందుకే ఈ పార్ట్ / ఫుల్ టైమ్ ప్రస్తావనతో ఇక జూనియర్‌కు గేట్లు మూసేసామని చెప్పకనే చెప్పారు లోకేశ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాయిదాలు కట్టలేక బెంజ్ కారు అమ్ముకున్నా... నిషిత్ కారు నాది కాదు... పవన్ కళ్యాణ్