Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బామ్మర్ది నీకు తితిదే ఛైర్మన్ పదవి ఇస్తున్నా.. ఎవరు..?

ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. ఇప్పటికే నందమూరి కుటుంబంలోని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు మరికొంతమందిని మరిచిపోయారు. ఇంకొంతమందైతే బాబుతో గొడవపడి వేరేగా వెళ్ళిపోయారు. అయితే నందమూ

బామ్మర్ది నీకు తితిదే ఛైర్మన్ పదవి ఇస్తున్నా.. ఎవరు..?
, బుధవారం, 14 జూన్ 2017 (12:31 IST)
ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. ఇప్పటికే నందమూరి కుటుంబంలోని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు మరికొంతమందిని మరిచిపోయారు. ఇంకొంతమందైతే బాబుతో గొడవపడి వేరేగా వెళ్ళిపోయారు. అయితే నందమూరి హరిక్రిష్ణ, బాలక్రిష్ణ, రామక్రిష్ణ వీరు మాత్రం బాబుతో కలిసే ఉన్నారు. బాలక్రిష్ణ ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా, హరిక్రిష్ణ ఎంపిగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామక్రిష్ణ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాలపైనే దృష్టంతా పెడుతున్నారు.
 
అయితే నందమూరి కుటుంబంలోని వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే బాబు ఆలోచన. ఇప్పటికే తితిదే ఛైర్మన్ పదవిని ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలకు ఇవ్వనని చెప్పారు బాబు. ఇక మాజీలు, పార్టీలో సీనియర్లుగా ఉన్న కొందరు తితిదే ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ తితిదే ఛైర్మన్ పదవిని నందమూరి హరిక్రిష్ణకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
ప్రస్తుతం హరిక్రిష్ణకు ఏ పదవి లేదు కాబట్టి.. రెండేళ్ళ పాటు ఈ పదవిని హరికి ఇవ్వాలన్నదే బాబు ఆలోచనగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని హరిక్రిష్ణకు స్వయంగా బాబు చెప్పారట. హరిక్రిష్ణ మాత్రం మీ ఇష్టమని చెప్పారట. ఇదంతా నిన్నోమొన్నో జరిగింది కాదు. ఎన్‌టిఆర్ జయంతి రోజే ఇదంతా జరిగిందట. 
 
అప్పటి నుంచి ఇప్పటివరకు నలుగుతూ వచ్చి ఈ విషయం కాస్త చివరకు నిన్న బయటకు వచ్చింది. కానీ బోర్డు సభ్యులు ఎవరన్నది ఇంకా బాబు నిర్ణయించుకోలేదట. మరో వారం రోజుల్లో తితిదే పాలకమండలి బోర్డు సభ్యులకు సంబంధించిన జిఓ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తమ్మీద నందమూరి హరిక్రిష్ణకు శ్రీవారి సేవ చేసుకునే అవకాశం వస్తుందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణీ స్త్రీలు ఆ కోరికలను పక్కనబెట్టాలి.. మాంసం మానుకోవాలి.. కోపాన్ని తగ్గించాలి..