Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎంగారూ.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరిది.. ఘోరంగా ఓడిపోతారు.. లగడపాటి సీక్రెట్ రిపోర్టు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ మాజీ నేత, మాజీ ఎంపీ, ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఓ సీక్రెట్ రిపోర్టు ఇచ్చారట. అందులో మంత్రులతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరును కళ్ళకుకట్టినట్టు

సీఎంగారూ.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరిది.. ఘోరంగా ఓడిపోతారు.. లగడపాటి సీక్రెట్ రిపోర్టు
, మంగళవారం, 2 మే 2017 (15:14 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ మాజీ నేత, మాజీ ఎంపీ, ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఓ సీక్రెట్ రిపోర్టు ఇచ్చారట. అందులో మంత్రులతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరును కళ్ళకుకట్టినట్టు సమాచారం ఉందట. ఈ రిపోర్టును చూసిన చంద్రబాబు ఖంగుతిన్నారట. 
 
అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ ఇటీవల సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం వ్యాపార కార్యకలాపాల నిమిత్తమే తాను చంద్రబాబును కలిశానని లగడపాటి బయటకు వచ్చాక చెప్పారు. 
 
కానీ, సీఎంను లగడపాటి కలవడం వెనుక ఏదో రహస్యం ఉండివుంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు పూర్తి నివేదిక ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.
 
ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై సానుకూలత ఉందని, 65 శాతం మంది ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని లగడపాటి చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై 65 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వివరించారట. 
 
రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు మాత్రమే నవ్యాంధ్రను అభివృద్ధి పట్టాలు ఎక్కించగలరని ప్రజలు నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఈ సందర్భంగా లగడపాటి గుర్తు చేశారని తెలుస్తోంది. దీనిని మర్చిపోవద్దని వ్యాఖ్యానించారట. 2014లో చంద్రబాబును చూసి ప్రజలు ఓటేశారని, కానీ 2019లో మాత్రం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలను కూడా చూసి ఓటేస్తారని చంద్రబాబును లగడపాటి హెచ్చరించారని తెలుస్తోంది. 
 
అలాగే, 2019లో మళ్లీ టిడిపి గెలవాలంటే పని చేయని వారిపట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని సూచించారట. అంటే... ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225 స్థానాలకు పెంచుకోవడం. ఇది టిడిపికి సానుకూలమని, నియోజకవర్గాల పెంపు కలిసి వస్తుందని చెప్పారని తెలుస్తోంది.
 
ముఖ్యంగా.. పార్టీలో, ప్రభుత్వంలో చెడ్డపేరు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులను సాగనంపేందుకు, కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు చొరవ చూపాలని లగడపాటి తన సీక్రెట్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోది. అంటే.. పాతవారి స్థానంలో కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల గెలుపు అవకాశాలు మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నట్టు తెలిపారు. 
 
కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపైనే కాకుండా, రాజధాని అమరావతి నిర్మాణం, రైతు రుణమాఫీ, ఇతర హామీల అమల్లో కూడా శ్రద్ధ చూపించాలని లేకపోతే.. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని లగడపాటి హెచ్చరించినట్టు వినికిడి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతిపై ఉద్యమం... రుజువైతే ఉద్యోగులు, అధికారులనైనా వదలొద్దు: ముఖ్యమంత్రి చంద్రబాబు