Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కత్తి మహేష్‌ మాటలకు ఓ లెక్కుందట.... ఆఁ... ఆఆఁ

కత్తి మహేష్. ఈ పేరు వింటేనే పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఒంటి కాలిపై లేచి నిలబడతారు. అభిమానులు దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్‌‌ను తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ అందరి దృష్టిలో పడ్డారు కత్తి మహేష్. కే

Advertiesment
కత్తి మహేష్‌ మాటలకు ఓ లెక్కుందట.... ఆఁ... ఆఆఁ
, శుక్రవారం, 19 జనవరి 2018 (17:01 IST)
కత్తి మహేష్. ఈ పేరు వింటేనే పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఒంటి కాలిపై లేచి నిలబడతారు. అభిమానులు దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్‌‌ను తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ అందరి దృష్టిలో పడ్డారు కత్తి మహేష్. కేవలం కత్తినే కాకుండా ఆయన కుటుంబంపైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు పవన్ అభిమానులు. సోషయల్ మీడియాలో కత్తి కుటుంబంపై వస్తున్న ఆరోపణల వెనుక నిజానిజాలు ఎంత.
 
సినీ విమర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్ పవన్ పైన ఆరోపణలు చేయడం ద్వారా అంతకు వందరెట్లు పాపులరయ్యారు. అంతేస్థాయిలో అభిమానులకు టార్గెట్ అయ్యారు. అటు సోషయల్ మీడియాలోను, ఇటు ప్రసార మాధ్యమాల్లోను మహేష్ కత్తిపై బండబూతుల వర్షం కురిపిస్తున్నారు పవన్ అభిమానులు. అంతటితో ఆగడం లేదు. ఆయన కుటుంబాన్ని ఏకి పారేస్తున్నారు. కత్తి తల్లిదండ్రులు మోసగాళ్ళని, గ్రామస్తులను మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలను గుప్పిస్తున్నారు. అసలు వాస్తవాలను తెలుసుకునేందుకు కత్తి మహేష్ స్వగ్రామం చిత్తూరు జిల్లా పీలేరులోని అతి సమీపంలోని యలమందలో ఆయన కుటుంబం ఎలాంటిదో తెలుసుకునేందుకు వెళితే వారి గ్రామస్తులే తెలిపారు.
 
గ్రామంలో కత్తి మహేష్ తండ్రి కత్తి ఓబులేసును ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ఓబులేసు చేసిన కృషిని అందరూ అభినందిస్తున్నారు. తమకు సోషయల్ మీడియా అంటే ఏమిటో పెద్దగా తెలియదని, కానీ ఓబులేసు గురించి అతని భార్యాపిల్లల గురించి చిన్నతనం నుంచి తెలుసునని అంటున్నారు. అందరికీ ఉపకారం చేయడమే తప్ప అపకారం చేయడం ఆ కుటుంబానికి తెలియదంటున్నారు యలమంద గ్రామస్తులు. 
 
గ్రామస్తుల అభిప్రాయం ఇలా ఉంటే మరి కత్తి కుటుంబంపై వచ్చిన పుకార్ల సంగతేంటి.. కత్తి మహేష్ తల్లి సరోజ నిజంగా చీటీల వ్యాపారం చేశారా. అందరినీ మోసం చేయడమే ఆమె ప్రవృత్తా. అంత అవసరం కత్తి కుటుంబానికి ఉందా. కత్తి తండ్రి ఓబులేసు అవినీతి సంపాదనతో కోట్లు సంపాదించారా.. పక్షవాతంతో బాధపడుతూ లేచి నడవలేని స్థితిలో ఉన్న కత్తి ఓబులేసు ఒక్కసారిగా తమ కుటుంబంపై వస్తున్న విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. అసలే భార్య పోయిన దుఖంలో ఉన్న బాధ కన్నా తమ కుటుంబం గురించి వస్తున్న విమర్శలే తనను అధికంగా బాధిస్తున్నాయని చెబుతున్నారు. 
 
పవన్‌ను విమర్శించినందుకు తన కొడుకుతో పాటు తనను అభిమానులు టార్గెట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా తన కొడుకుపైన స్వగ్రామంలో కూడా పవన్ అభిమానులు దాడికి యత్నించడంపై తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్‌ కల్పించుకుని అభిమానులను సరైన మార్గంలో పెట్టాల్సిందిగా కోరుతున్నారు. తన కొడుకు పవన్‌ను తప్ప ఆయన కుటుంబంపై ఎప్పుడూ, ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని, అభిమానులు మరి మమ్మల్ని ఎందుకు తనను, తన భార్యను రోడ్డుపైకి లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరాస గూటికి మోత్కుపల్లి నర్సింహులు...?