Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాజ్ మహల్ నిర్మాణానికి పునాది ముంతాజ్ బేగం... చనిపోయింది జూన్ 17, ఆత్మ ఇంకా తిరుగుతోందట....

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కట్టడం ఆగ్రాలోని తాజ్‌మహల్ కూడా ఒకటి. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా...? షాజహాన్ తన ప్రాణంతో సమానంగా చూసుకున్న ముంతాజ్ బేగం జూన్ 17న 1631న కన్నుమూసింది. ఆమె జ్ఞాపకార్థం మొఘల్ రాజు షాజహాన్‌ తాజ్ మహల్ నిర్మించారు

Advertiesment
June 17th 1631
, శుక్రవారం, 17 జూన్ 2016 (11:46 IST)
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కట్టడం ఆగ్రాలోని తాజ్‌మహల్ కూడా ఒకటి. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా...? షాజహాన్ తన ప్రాణంతో సమానంగా చూసుకున్న ముంతాజ్ బేగం జూన్ 17న 1631న కన్నుమూసింది. ఆమె జ్ఞాపకార్థం మొఘల్ రాజు షాజహాన్‌ తాజ్ మహల్ నిర్మించారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే తాజ్‌మహల్‌ నిర్మించడానికి ముందు ముంతాజ్ మృతదేహాన్ని బర్హాంపూర్‌లోని బులారా మహల్‌లో పూడ్చి పెట్టిన విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇప్పటికీ ఈ మందిరంలో ముంతాజ్ ఆత్మ తిరుగాడుతూ ఉంటుందని నానుడి. 
 
దాదాపు 400 ఏళ్ల క్రితం బులారా మహల్‌లో మొఘల్ రాణి ముంతాజ్ బేగం కన్నుమూసినప్పుడు ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ ఒక అందమైన స్మారకమందిరాన్ని నిర్మించాలని భావించాడు. తర్వాతే ఆయన మనసులో తాజ్‌మహల్ రూపుదిద్దుకుంది. మొదట్లో ఈ మందిరాన్ని బర్హాంపూర్‌లోనే నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల దాన్ని ఆగ్రాలో నిర్మించారు. 
 
తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే ముంతాజ్ దేహాన్ని అక్కడికి తరలించారు. అయితే ముంతాజ్ మృతదేహాన్ని మాత్రమే అక్కడినుంచి తీసుకుపోయారు తప్ప ఆమె ఆత్మ మాత్రం ఇప్పటికీ బులారా మహల్‌లోనే ఉండిపోయిందని స్థానికులు ఇప్పటికీ భావిస్తున్నారు. 
 
బులారా మహల్ నుంచి ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయట. అయితే ముంతాజ్ ఆత్మ ఇంతవరకు ఎవరినీ గాయపర్చలేదని స్థానికులు చెబుతుంటారు. చారిత్రక వాస్తవాలను బట్టి చూస్తే 1631లో ముంతాజ్ ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత మరణించింది. బిడ్డ పుట్టాక మరణించింది కాబట్టే ఈ మందిరంలో ఇప్పటికీ ముంతాజ్ ఆత్మ బిడ్డకోసం తపిస్తూ తిరుగాడుతూ ఉందని స్థానికులు చెబుతుంటారు.
 
మరి బర్హాంపూర్‌ మందిరంలో తిరుగాడుతున్న ఆత్మ గురించిన వార్తలు నిజమా లేక ఈ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తులు ఇక్కడ తమ అక్రమ కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించేందుకు గాను ఇలా ఆత్మ గురించిన ప్రచారాలు చేస్తున్నాయా..? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. కానీ ముంతాజ్ బేగం మాత్రం అలా బ్రతికే ఉంది మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటోపై పోలీస్ స్టేషన్లో ఘర్షణ: వ్యక్తి మృతి