Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీఎస్టీ రూపశిల్పి ఎవరో తెలుసా?

జీఎస్టీ... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (వస్తు, సేవల పన్ను). జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. స్వతంత్ర భారతావనిలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో అతిపెద్దది. దీంతో దేశంలో జీఎస్టీ శకం ఆర

జీఎస్టీ రూపశిల్పి ఎవరో తెలుసా?
, శనివారం, 1 జులై 2017 (09:14 IST)
జీఎస్టీ... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (వస్తు, సేవల పన్ను). జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. స్వతంత్ర భారతావనిలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో అతిపెద్దది. దీంతో దేశంలో జీఎస్టీ శకం ఆరంభమైంది. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకటే పన్ను నినాదంతో దీన్ని అమల్లోకి తెక్చారు. దీని పరిధిలోకి 500 రకాల సేవలు వచ్చాయి. 1211 రకాల వస్తువులు, కోటి మంది వ్యాపారులు, 134 కోట్ల మంది ప్రజలు, 130 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ జీఎస్టీ కిందకు వచ్చింది. అలాంటి జీఎస్టీకి రూపశిల్పి ఎవరో తెలుసా?
 
ఆయన పేరు అసిమ్‌ దాస్‌గుప్తా. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త. వెస్ట్ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి. పుష్కరకాలం పాటు శ్రమించి ఆయన సంక్లిష్టమైన ఈ విధానానికి జీవం పోశారు. ఆర్థిక గణాంకాల మదింపులో ఆయనది అందెవేసిన చేయి. మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో డాక్టరేట్‌ చేశారు. ఈయన ప్రతిభను నాటి ప్రధానులు వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ గుర్తించారు. 
 
ముఖ్యంగా స్వయంగా ఆర్థికశాస్త్రవేత్త అయిన మన్మోహన్‌ దేశంలో పన్నుల వ్యవస్థలో పెను మార్పులకు నాంది పలికే జీఎస్టీకి దాస్‌ గుప్తా మాత్రమే స్పష్టమైన రూపం ఇవ్వగలరని విశ్వసించి, ఆ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన దాస్‌ గుప్తా జీఎస్టీ విధి విధానాలపై పారిశ్రామిక వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలతో సుదీర్ఘంగా చర్చించారు. 
 
జీఎస్టీ విధానానికి 80లో రూపకల్పన ఇచ్చానని దాస్‌ గుప్తా స్వయంగా చెప్పారు. అయితే, 2011లో పశ్చిమబెంగాల్‌లో మమత అధికారంలోకి రావడంతో అసిమ్‌దాస్‌ గుప్తా జీఎస్టీ కమిటీ సారథ్యం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు జీఎస్టీకి సారథ్యం వహించి తుదిరూపు తీసుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య డబ్బుతో ప్రియురాళ్ళతో భర్త ఎంజాయ్.. పడక గదిలో ఇద్దరమ్మాయిలతో...