Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్స్‌కు షెడ్యూల్ వేస్కుంటున్న తెలుగు జంటలు... పిల్లల్లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ....

ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లు చెప్పినట్లు మాత్రం జరగడంలేదు. చదవు, కెరీర్, ఉద్యోగం, ఉన్నతస్థానం... ఆర్థికంగా నిలదొక్కుకోవడం... ఇలా అన్నీ సమకూర్చుకునేసరికి అబ్బాయికి 40 ఏళ్లు, అమ్మాయికి 30 ఏళ్

సెక్స్‌కు షెడ్యూల్ వేస్కుంటున్న తెలుగు జంటలు... పిల్లల్లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ....
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (12:37 IST)
ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లు చెప్పినట్లు మాత్రం జరగడంలేదు. చదవు, కెరీర్, ఉద్యోగం, ఉన్నతస్థానం... ఆర్థికంగా నిలదొక్కుకోవడం... ఇలా అన్నీ సమకూర్చుకునేసరికి అబ్బాయికి 40 ఏళ్లు, అమ్మాయికి 30 ఏళ్లు. అప్పుడు చాలా లేటుగా పెళ్లి. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత... అయ్యో పిల్లలు కలగడంలేదే అంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ చక్కెర్లు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. 
 
ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.8కి క్షీణించినట్లు తేలింది. టోటల్ ఫెర్టిలిటీ రేటు అంటే, ఒక మహిళ తన పునరుత్పత్తి కాలంలో... అనగా 15-49 సంవత్సరాల వయసులో జన్మిస్తున్న చిన్నారుల సంఖ్య అన్నమాట. ఈ కారణంగా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సంతానలేమి కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ జంటలు తిరుగుతున్నారు. పిల్లల కోసం ఎన్నో పరీక్షలు చేయించుకుంటూ నానా అవస్థలు పడుతున్నారు. 
 
ఇదిలావుంటే... పని ఒత్తిడి, ఉద్యోగంలో డే అండ్ నైట్ డ్యూటీల కారణంగా ఇపుడు చాలామంది జంటలు సెక్సులో పాల్గొనేందుకు షెడ్యూళ్లు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో పిల్లలు కలిగే సమయంలో కాకుండా వారికి అనువైన సమయాల్లో సంభోగంలో పాల్గొనడంతో వారికి సంతానం కలుగడంలేదు. సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ తిరిగేవారిలో 20 శాతం జంటలకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేకపోయినా పిల్లలు కలుగడం లేదంటూ వెళుతున్నారు. నిజానికి వీరు తమ సంభోగాన్ని స్త్రీ బహిష్టు ముగిశాక 10 నుంచి 17 రోజుల మధ్య సాగిస్తే సంతానవంతులవుతారు. ముఖ్యంగా నగరాల్లో ఇలాంటి జంటలు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు చెపుతున్నారు. ఏదేమైనా పెద్దలు చెప్పినట్లు ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితే ఈ చిక్కులన్నీ ఎదురుకావు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం కావాలనుకుంటున్నారా? రూ.200 కోట్ల ఆఫర్‌ను ఎందుకు వద్దనుకున్నారు?