పెద్దనోట్లతో పురుషులు ఫైర్.. బంగారంపై ఆంక్షలతో మహిళలు మండిపాటు.. మోడీకి ప్లసా మైనస్సా?
నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద
నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద నోట్ల కష్టాలు తీరకు ముందే బంగారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కన్నేశారు. అక్రమ బంగారంపై లెక్క చెప్పాల్సిందేనని ప్రకటించారు.
నోట్ల రద్దుతో ఆర్బీఐ ఆఫీసులో గత వారం రోజులుగా నోట్ల మార్పిడికి వేలాది మంది ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో ఆర్బీఐ నిల్వలు కూడా క్రమేణా తగ్గిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో భారీ రద్దీ ఏర్పడింది. క్యూలైన్లలో గంటలు గంటలు గడపాల్సి వస్తుందని, రూ.2000 నోట్లు ఇస్తుంటే చిల్లర సమస్యగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల పెట్టగానే ఉద్యోగులు జీతాలు తీసుకోవడానికి అప్పుడే బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. రూ.24 వేలు మాత్రమే వారానికి డ్రా చేసుకునే పరిమితి ఉండటంతో జీతాల కోసం పురుషులు భారీ ఎత్తున బ్యాంక్ క్యూల్లో నిలబడుతున్నారు. ఎంతో సమయం నోట్ల మార్పిడి, విత్ డ్రా, డిపాజిట్ల కోసం వృధా అవుతుందని పురుషులు వాపోతున్నారు. కార్డులను ఎక్కడ కావాలో అక్కడ వాడేస్తున్నా.. చిల్లర ఖర్చులు వంటివి సమస్యగా మారిపోతున్నాయి. బ్యాంకు లైన్లలో గంటల పాటు నిలిచినా క్యాష్ అయిపోవడం కొత్త సమస్యగా మారింది.
క్యూ లైన్లో నిల్చోవడం ఇష్టపడని వారు, క్యూలో ఉన్నవారికి కమీషన్ ఇస్తూ నగదును డ్రా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు ఐడీ కార్డులపై నగదు డ్రా చేస్తున్నారు. దీంతో నగదు కూడా ఆర్బీఐలో అయిపోతున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా డబ్బు ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇలా పురుషులు నోట్ల కష్టాలను ఎదుర్కొనేందుకు అష్టకష్టాలు పడుతుంటే.. మహిళలు బంగారంపై పన్ను విధించడంపై మండిపడుతున్నారు.
లెక్కకు మించిన బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్క చెప్పాలంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండాలి అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. సొంతంగా సంపాదించిన డబ్బుతో బంగారం కొంటే ఇబ్బందిలేదన్నారు. పన్ను మినహాయింపు పొందిన డబ్బుతో కొనుగోలు చేసినా సమస్యలు ఉండవన్నారు. ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే తప్పులేదని వివరణ ఇచ్చారు. వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పుకొచ్చారు.
వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. సీజ్ చేయమని చెప్పారు. ఒక్కో వివాహిత మహిళ 500 గ్రాముల (అరకిలో) బంగారం ధరించవచ్చు. వివాహంకానీ మహిళ 250 గ్రాముల బంగారు ఆభరణాలు ధరించవచ్చు. మగాళ్ల దగ్గర 100 గ్రాముల బంగారానికి మించి ఉండరాదు. మహిళలు, పురుషుల దగ్గర ఉండాల్సిన బంగారం కంటే అధికంగా అంటే.. అది లెక్కల్లో చూపిన డబ్బుతో కొనుగోలు చేసిందై ఉంటే మాత్రమే చర్యలుంటాయి.
పన్ను మినహాయింపు పొందిన ఆదాయంతో బంగారం కొనుగోలు చేసినా ఇబ్బందులు ఉండవు. లెక్కల్లో చూపని ఆదాయంతో బంగారం కొనుగోలు చేస్తే ట్యాక్స్ వేస్తారు. స్త్రీధనంగా వచ్చిన బంగారంపై ఆంక్షలు ఉండవని తెలిపారు. అయితే పద్ధతిపై మహిళలు సానుకూలంగా స్పందిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలను ఈ బంగారంపై షరతులు ఎంతగానో ఉపయోగిస్తాయని.. సంపన్నులు సంపన్నులైతే.. పేదలు పేదలుగానే ఉండిపోతారని.. మోడీ బంగారంపై సరైన నిర్ణయం తీసుకున్నారని.. అనేకమంది మహిళలు స్పందించారు.
అయితే ఆడవారు సెంటిమెంట్‌గా భావించే బంగారంపై ఆంక్షలు విధించడం సరికాదని మరికొందరు మహిళలు వాపోతున్నారు. మొత్తానికి నోట్ల రద్దుతో పురుషులను ఇబ్బంది పెట్టి.. బంగారంపై ఆంక్షలు విధించి మహిళను కష్టాలకు గురిచేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.