Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు...!

కార్పొరేట్‌ కళాశాలల ధనదాహానికి ముక్కుపచ్చలారని జీవితాలు బలైపోతున్నాయి. తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలన్న తల్లిదండ్రులకు చివరకు పిల్లలే లేకుండా పోతున్నారు. కార్పొరేట్‌ కళాశాలల్లో సెంట్రల్‌ జైళ్ళను తలపి

Advertiesment
Corporate Colleges
, గురువారం, 10 నవంబరు 2016 (16:11 IST)
కార్పొరేట్‌ కళాశాలల ధనదాహానికి ముక్కుపచ్చలారని జీవితాలు బలైపోతున్నాయి. తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలన్న తల్లిదండ్రులకు చివరకు పిల్లలే లేకుండా పోతున్నారు. కార్పొరేట్‌ కళాశాలల్లో సెంట్రల్‌ జైళ్ళను తలపించే విధంగా విద్యావ్యవస్థ ఉండడంతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు విద్యార్థులు. హాయిగా చదువుకోవాల్సిన సమయంలో తమ జీవితాలను అర్థాంతరంగా ఆర్పేసుకుంటున్నారు. ఇలాంటి విద్యార్థుల బలవనర్మణాలకు నారాయణ, శ్రీచైతన్య లాంటి కళాశాలలు అడ్డాలుగా మారుతున్నాయి. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
 
కార్పొరేట్‌ కళాశాలలంటే మార్కులు, ర్యాంకులే కాదు ఆత్మహత్యలు.. విద్యార్థుల మరణాలు కూడా వినిపిస్తాయి. చదువుల తల్లి సరస్వతి కొలువై ఉండాల్సిన కళాశాలల్లో మరణ మృదంగాలు మోగుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక భవనాల పై నుంచి దూకి చనిపోయే విద్యార్థులు కొంత మందైతే, ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థులు మరికొంతమంది. చదువుకోవాల్సిన వయస్సులో చట్టేతంటటి సాహశాలను విద్యార్థులు ఎందుకు చేస్తున్నారని పరిశీలిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
ఇరుకిరుగు గదుల్లో, చాలీ చాలని అన్నం పెడుతూ రోజుకు 12 గంటలు, 13 గంటలు చదివించేలా తయారైన కార్పొరేట్‌ కళాశాలల టైం టేబుల్‌ చూస్తే అమ్మో అనిపించకమానదు. ఇటు వారి టైం టేబుల్‌కు అనుగుణంగా చదవలేక, అటు ఆ విషయాలను తల్లిదండ్రులకు చెప్పలేక చాలా మంది విద్యార్థులు వారిలో వారే కుమిలిపోతున్నారు. మరికొంతమంది ఈ మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలిగించుకోవడం కోసం ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యావిధానం మాత్రం మారడం లేదు. 
 
ముఖ్యంగా కార్పొరేట్‌ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. మార్పుల వేటలో చివరకు తమ ప్రాణాలను బలిపెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యాలయాలు కాస్త శ్మశానాలుగా మారే పరిస్థితి ఉంది. ఎంతో మంది భావితరాల పౌరులు తమ భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికైనా ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలామంది పిల్లలు తమ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారికి ఆర్టీసీ రూ.35 కోట్లు బాకీ... ఎందుకంటే...