Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ... స్థలం సిద్ధం.. జగన్ పచ్చజెండా (video)

విశాఖలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ... స్థలం సిద్ధం.. జగన్ పచ్చజెండా (video)
, శుక్రవారం, 6 మార్చి 2020 (17:16 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా, విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్నది జగన్ బలమైన ఆలోచనగా ఉంది. ఆ దిశగా అధికారులు వడివడిగా అడుగులు వేశారు. సెక్రటేరియట్‌ను మిలీనియం టవర్‌లో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, తూర్పు నౌకా దళం ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలపడంతో వెనక్కి తగ్గింది. 
 
దీంతో ప్రత్యామ్నాయ స్థలాలు, భవనాలపై అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో కొత్త స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 
 
గత కొద్ది రోజుల నుంచి ఏపీలో మూడు రాజధానుల అంశంపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో సచివాలయంను నిర్మించనున్నారనే వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణం కోసం స్థలాన్ని కూడా రెడీ చేసినట్లు సమాచారం. 
 
వైజాగ్‌లోని మధురవాడలో మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయంను నిర్మించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందట. గతంలో కాపులప్పాడ కొండపై ఐటీ లే అవుట్‌ని రూపొందిచారు.
webdunia
 
అదానీ సంస్థ ఈ కొండపై డేటా పార్కును ఏర్పాటు చేస్తామనడంతో.. ముందు ఈ స్థలాన్ని కేటాయించారు. అయితే కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడే పెడతామని ఆ సంస్థ చెప్పడంతో.. వేరే చోట స్థలాన్ని కేటాయించడం జరిగింది. 
 
ప్రస్తుతం కొండపై 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, 250 ఎకరాల్లో లే అవుట్ వేశారు. ఇప్పటికే 175 ఎకరాల స్థలాన్ని చదును చేయగా.. మరో 600 ఎకరాల స్థలాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే కొండపై సచివాలయం, గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణాలు ఏర్పడనున్నాయని తెలుస్తోంది.

అటు.. అమరావతిలో రైతులు మాత్రం మూడు రాజధానులకు విరుద్ధంగా.. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలు చేపట్టి 75 రోజులకు మించిపోయాయి. మరోవైపు, వైజాగ్ రాజధానిని ఒక్క వైకాపా మినహా తెదేపా, బీజేపీతో పాటు.. ఇతర రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీ ఛైర్మన్ ముందుచూపు.. YES BANK నుంచి దేవుడి సొమ్ము రిటర్న్