Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు మంత్రివర్గ విస్తరణలో చోటెవరికి.. వేటెవరిపై.. పెద్ద నోరున్న అచ్చెన్నకు పార్టీ పదవి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ చంద్రబాబు కంప్యూటర్‌ ఏం చెబుతుందో తెలుసుకోవడం మాత్రం చాలాకష్టం. మంత్రులు మొదలుకుని, ఎమ్మెల్యేల వరకు ప్రోగ్రెస్‌ కార్డులు

Advertiesment
CM Chandrababu
, గురువారం, 27 అక్టోబరు 2016 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ చంద్రబాబు కంప్యూటర్‌ ఏం చెబుతుందో తెలుసుకోవడం మాత్రం చాలాకష్టం. మంత్రులు మొదలుకుని, ఎమ్మెల్యేల వరకు ప్రోగ్రెస్‌ కార్డులు సిద్థం చేసిన చంద్రబాబు, మెరిట్‌ లిస్టు ఈ సారి మరింత కాప్లింకేటెడ్‌గా ఉండబోతుందంట. ఎందుకంటే పనితీరుతో పాటు కుల, ప్రాంతీయ సమీకరణాలు షరా మామూలే. 
 
వాటికితోడు ఈసారి పార్టీ మారిన వారిని సర్దుబాటు చేయాల్సి రావడమే దీనికి కారణమట. మా పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు కూడా ఇందులో ఉండబోతున్నాయంట. కాకపోతే బ్యాలెన్స్ చేసుకోవడానికి పార్టీ పదవులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారు పొయ్యే వారు లిస్టు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్న సంకేతాలు ఇప్పటికే పార్టీ నాయకులు అందినట్లు తెలుస్తోంది.
 
పెద్ద నోరేసుకుని ప్రత్యర్థులపై పడిపోయేవారు ప్రభుత్వంలో కంటే పార్టీలోనే ఉండటం బెటరన్న ఈక్వేషన్‌లో అచ్చెన్నాయుడుకు ఏపీ పార్టీ అధ్యక్ష పదవి ఒకే చేశారట. ఇక ఆ ప్లేస్‌లో ఉన్న కళావెంకట్రావును కేబినెట్‌లో తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రాజధాని ప్రాంతంలో అనేక విమర్శలు ఎదుర్కొంటూ పదవి పరంగా కూడా తక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రత్తిపాటి పుల్లరావుకు బుగ్గ కారు సౌకర్యం తీసేస్తున్నారట. అనేక ఆరోపణలకు సెంటరాఫ్‌ అయిన పీతల సుజాత పేరు కూడా లిస్ట్ నుంచి అవుట్‌ అయిన్నట్లు సమాచారం. ఇక పల్లెకు మంత్రి పదవి పోతుందంటూ ఎప్పటి నుంచో ఉన్న ప్రచారాన్ని నిజం చోయబోతున్నారంట చంద్రబాబు.
 
ఇక వచ్చే వారి లిస్టులో మాత్రం చాలా సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి. అనధికారికంగా ఇన్ని పనులు. ఎన్ని రోజులు చేస్తామని ఫీల్‌ అవుతున్న చినబాబుకు మంత్రి పదవికీ గ్యారెంటీ అన్న విషయం తెలిసిందే. అయితే ఐటీ రంగాన్ని ఆయన పరుగులు పెట్టించడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో పట్టుబిగించడం కోసం మరో పెద్ద తలకాయను చంద్రబాబు పక్కన పెట్టుకోబోతున్నట్లు సమాచారం. ఆ కోటాలో వైసీపీ నుంచి టీడిపిలోకి వచ్చిన సుజయ కృష్ణ రంగారావును కేబినెట్‌ బెర్త్ దక్కుతుందంటున్నారు. 
 
ఇక చంద్రబాబు తన సొంత జిల్లా నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకే బెర్త్ ఖరారు చేశారంట. సుదీర్ఘ కాలంలో పార్టీలో ఉండి తర్వాత పక్క పార్టీకి వెళ్ళిన అమరనాథ్‌ రెడ్డిని మంత్రిని చేయాలనుకుంటున్నారట. మహిళా కోటలో కొత్తగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఇంకా ఈక్వేషన్స్ కుదరలేదట. ఒకవేళ తీసుకుంటే మాత్రం భూమా అఖిలప్రియకు ఒక అవకాశం ఇచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన షేర్లు. క్యాబినెట్‌లో మొత్తం ఎంతమంది ఉంటారన్న సంగతి తెలిస్తే మాత్రం లిస్టులో మరి కొన్ని పేర్లు చేరే అవకాశం కనిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 ఎన్నికలే టార్గెట్.. రాజకీయ వారసులు వచ్చేస్తున్నారు.. గుంతకల్లు నుంచి జేసీ పవన్ రెడ్డి?