Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబుకు జగన్‌పై కోపం సరే.... విశాఖను పులివెందులలా మార్చేస్తున్నారంటే...?

జగన్ పైన ఉన్న కోపంతో రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేడాగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హోదా పోరాటంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ నాయకత్వంల

బాబుకు జగన్‌పై కోపం సరే.... విశాఖను పులివెందులలా మార్చేస్తున్నారంటే...?
, శనివారం, 28 జనవరి 2017 (18:52 IST)
జగన్ పైన ఉన్న కోపంతో రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేడాగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హోదా పోరాటంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ నాయకత్వంలో ఆందోళన జరుగుతోంది. ప్రతిపక్షం ఆందోళనపై సిఎం రాజకీయంగా వ్యతిరేకించారు. వారి విధానం వారిది. కానీ విశాఖలో జరపతలపెట్టిన ఆందోళనను వ్యతిరేకించే పేరుతో విశాఖను పులివెందులుగా మార్చే కుట్రను జగన్ చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా తుని ఘటనలో పులివెందుల గూండాలు ఉన్నారంటూ ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.
 
బాబు గారి ఆధ్వర్యంలోని విచారణ సంస్థలు చేసిన విచారణలో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక్కరు కూడా పులివెందుల వారు, రాయలసీమ వారు కూడా లేరు. విచారణ తరువాత అయిన ఒక ప్రాంతంపై తాను వేసిన అపనింద వల్ల ఆ ప్రాంత ప్రజలు నొచ్చుకుని ఉంటారని గ్రహించి తాను మాట్లాడిన మాటలపై కనీస విచారం కూడా వ్యక్తం చేయకుండా ఇప్పుడు ఏకంగా ప్రశాంతంగా ఉన్న విశాఖను పులివెందుల చేస్తారా అంటూ విమర్శలకు దిగడంతో ముఖ్యమంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
రాయలసీమను ఒక నేర స్వభావం కలిగిన ప్రాంతంగా చిత్రీకరించడం అందులోను సీమకే చెందిన ముఖ్యమంత్రి ఇందుకు పూనుకోవడం భావ్యమా... నిజానికి ఎపిలో ప్రాంతాలవారీగా నేర స్వభావంపై పోలీసు డెయిరీని తిప్పి చూస్తే మిగిలిన ప్రాంతాల కన్నా నేరాలు, ఘోరాలు సీమలో తక్కువేనని అందరికీ తెలుసు. ఒకవేళ ఇక్కడ అలాంటి వ్యవహారాలు జరుగుతుంటే తానే ముఖ్యమంత్రిగా గతంలో పదేళ్ళు నేడూ ఉన్నారు. కఠినంగా శిక్షించాలి తప్ప అభాండాలు వేయడం తగదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నిర్దోషినే.. కింగ్‌ఫిషర్ మునిగిపోవడానికి ప్రభుత్వమే కారణం: విజయ్ మాల్యా