Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ డిమాండ్ ప్రత్యేక హోదా వేస్టా...? వెంకయ్య మాటలకు అర్థం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే సంకేతాలను కేంద్రం ఎప్పుడో పంపింది. కానీ స్పెషల్ స్టేటస్ కోసం ప్రతి ఒక్కరూ పట్టుబడుతుండటంతో.. బీజేపీ తలపట్టుకుని కూర్చుంది. ఏపీకి హోదా ఇస్తే ఒడిశా, బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా మాకూ హోదా కావాలని పట్ట

Advertiesment
పవన్ డిమాండ్ ప్రత్యేక హోదా వేస్టా...? వెంకయ్య మాటలకు అర్థం ఏమిటి?
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (13:54 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే సంకేతాలను కేంద్రం ఎప్పుడో పంపింది. కానీ స్పెషల్ స్టేటస్ కోసం ప్రతి ఒక్కరూ పట్టుబడుతుండటంతో.. బీజేపీ తలపట్టుకుని కూర్చుంది. ఏపీకి హోదా ఇస్తే ఒడిశా, బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా మాకూ హోదా కావాలని పట్టుబడతాయ్. తద్వారా రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారిపోతుంది. దీంతో కేంద్రంలోని ఎన్డీయే పార్టీకి కష్టాలు తప్పవు. 
 
అందుకే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటిదాకా మనదేశంలో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంది.
 
ప్రస్తుతం ప్రత్యేక హోదా 11 రాష్ట్రాలకు అమలవుతోంది. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు. ఇప్పటికున్న ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఆ కేటగిరీని తప్పిస్తారు. కానీ హోదా కింద ఇప్పటి వరకు అందుతున్న ప్రయోజనాలను మాత్రం కొనసాగిస్తారు. కానీ ఏపీకి స్పెషల్ ఇవ్వకుంటే మాత్రం ఆంధ్రకు తీవ్ర నష్టం జరగక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
అదే ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తే..  కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులొస్తాయి. అంటే ఆయా పథకాలకయ్యే మొత్తంలో 60 శాతం కేంద్రం భరిస్తే, రాష్ట్రాలు 40 శాతం భరించాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మాత్రం పది శాతం భరిస్తే చాలు. కేంద్రమే 90 శాతం ఖర్చుచేస్తుంది. కానీ ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరోక్షంగా ఇవ్వమని చెప్పేశారు. 
 
ప్రత్యేక హోదాను మించిన సాయం ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి అది పూర్తిగా అర్థమైపోతుందని విశ్లేషకులు అంటున్నారు. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించబోనని, సమయానుగుణంగా పవన్‌పై స్పందిస్తానని వెంకయ్య వెల్లడించారు. 
 
ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అని నినదిస్తున్నారని, దాని వలన ప్రయోజనం ఏ పాటిదో అన్నది ఇదివరకు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేకున్నామో అంటూ, ఒకరికి ప్రకటిస్తే, తమకూ, తమకూ అంటూ గళం విప్పేవాళ్లు పెరుగుతున్నారని, మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటో ప్రశ్నించే వాళ్లూ ఉన్నారని వ్యాఖ్యానించారు.
 
రాష్ట్ర విభజన సమయంలోనే ఈ విషయాన్ని అప్పటి పాలకులు తేల్చి ఉండాల్సిందని, కేవలం నోటి మాటతో సరిపెట్టారని యూపీఏ సర్కారుపై వెంకయ్య విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మించిన సాయం అందించేందుకు తగ్గ కసరత్తులు వేగవంతం చేశామని ప్రకటించారు. వెంకయ్య కామెంట్స్ బట్టి చూస్తే ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేరని స్పష్టమవుతోంది.
 
రాష్ట్ర విభజన తరుణంలో స్పెషల్ స్టేటస్‌పై గొంతు చించుకున్న వెంకయ్య ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు పోటీకొస్తాయని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్టేటస్‌తో నో యూజ్ అంటూ కామెంట్ చేయడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్‌పై తప్పును నెట్టేసి.. ఇతర రాష్ట్రాలతో ఇబ్బందులొస్తాయని బీజేపీ చేతులు దులిపేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపజేయండి... అంటూ ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేంద్రం వైఖరితో ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో దారుణం... మహిళా మృతదేహంతో శృంగారం.. ఇద్దరు యువకుల అరెస్ట్..