Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలసర్ప దోష నివారణ కోసం యాగం చేసిన బాలయ్య.. పర్సనల్ యాగం.. పొలిటికల్ మైలేజీ కోసమేనా?

నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కాలసర్ప దోష నివారణ కోసం యాగం చేశారట. ఎవరు పడితే వాళ్లు ఈ పూజను చేయరని.. కాలసర్పదోష నివారణ యాగం పదవీ యోగం కోసమే చేస్తారని పండితులు అంటున్నారు. అలాంటిది.. బాలయ

Advertiesment
Balayya
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:32 IST)
నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కాలసర్ప దోష నివారణ కోసం యాగం చేశారట. ఎవరు పడితే వాళ్లు ఈ పూజను చేయరని.. కాలసర్పదోష నివారణ యాగం పదవీ యోగం కోసమే చేస్తారని పండితులు అంటున్నారు. అలాంటిది.. బాలయ్య పదవీ యోగం కోసం చేశారా? అనుకుంటే.. ఆయన సీఎం పదవి కోసం ఆశపడుతున్నారా? అనే అనుమానం ఏర్పడుతుంది. టీడీపీలో ఉన్నత పదవి కోసమే బాలయ్య ఈ యాగాన్ని నిష్టతో చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ ఆశ్రమంలో బాలయ్య దంపతులు నిష్టతో ఈ పూజను చేశారు. 
 
బాలయ్య పంచె కట్టుకుని నిష్టగా కొన్ని గంటల పాటు కూర్చొని వేద పఠనం మధ్య యాగాన్ని పూర్తి చేశారు. ఈ యాగం బాలయ్య మంత్రి పదవిని ఆశించి చేశారని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం బాలయ్య కచ్చితంగా సీఎం పదవి కోసమే యాగాన్ని చేశారంటున్నారు. మరికొందరైతే.. ఇందులో నిజం లేకపోవచ్చునని.. టీడీపీ చీఫ్ చంద్రబాబును తప్పించి తానే సీఎం కావాలనే దారుణమైన ఆలోచనలు మాత్రం బాలయ్య లాంటి బోళా మనిషి మనసులోకి రాకపోవచ్చునని చెప్తున్నారు. ఇందుకు తోడు బాలయ్యకు మంత్రి పదవిపైనే ఆసక్తి ఎక్కువని, పర్యాటక శాఖ అయితే తనకు బెస్ట్ అని చెప్పేశారు. మరి బావమరిది కోరికను సీఎం అయిన బావ అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి.  
 
కొంతకాలంగా మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నా.. అటు లోకేశ్, ఇటు బాలయ్యకు ఒకేసారి పదవి ఇవ్వలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దానిని వాయిదా వేస్తూ వస్తున్నారని టాక్. అందుకే పదవీ యోగం కోసం సతీసమేతంగా ఈ యాగం నిర్వహించారని.. అక్కడ లోకేష్ దంపతులు కానీ, వియ్యంకులు చంద్రబాబు దంపతులు కానీ కనపడకపోవడంతో.. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత యోగం గురించి చేపట్టిన యాగంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
వయస్సు మీద పడటంతో సినిమాలకు త్వరలో స్వస్తి చెప్పి.. పూర్తి స్థాయిలో ప్రజా సేవ చేయాలని బాలయ్య అనుకుంటున్నారట. అయితే ఒకవైపు నారా లోకేష్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం గురించి తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే తనకు మంత్రి పదవి వస్తే.. మెల్ల మెల్లగా రాజకీయంగా నిలదొక్కుకుని పార్టీ పగ్గాలు చేపట్టవచ్చునని బాలయ్య భావిస్తున్నట్లు  రాజకీయ వర్గాల సమాచారం. మొత్తానికి బాలయ్య చేసిన యాగం రాజకీయ మైలేజీ కోసమేనని టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ యూఎస్ఎ టైటిల్ గెలుచుకున్న దెషౌనా బార్బర్...కోతిలా అందవికారంగా ఉన్నావని..