Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్ధుల్ కలాం టాబ్లెట్ పీసీని ఎలా కనుగొన్నారో తెలుసా?

అబ్ధుల్ కలాం టాబ్లెట్ పీసీని ఎలా కనుగొన్నారో తెలుసా?
, శనివారం, 27 జులై 2019 (14:29 IST)
భారత మాజీ రాష్ట్రపతి, విజ్ఞాన వేత్త ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ వర్ధంతి నేడు (జూలై 27). ఆయన జన్మదినం అక్టోబరు 15. ఈ రోజును అంటే అక్టోబరు 15 ఆయన యువత పునరుజ్జీవన దినం (యూత్‌ రినస్సెన్స్‌ డే) గా జరపనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయునిగా వుండటానికి ఎప్పుడూ ఇష్టపడే ఆయన, యువతలో స్ఫూర్తిని నింపారు. 
 
శాస్త్రవేత్తగా కలాం అందిచిన సేవలకు భారత ప్రభుత్వం వివిధ కాలాల్లో పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న అవార్డులను బహుకరించింది. కలాం 1992 నుంచి 1999 వరకు ప్రధాని శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారుగా, డీఆర్ డీఓ కార్యదర్శిగా సేవలందించారు.
 
భారత అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. ఆయన మిస్సైల్‌ మ్యాన్‌, న్యూక్లియర్‌ హీరో. శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవ ఆదర్శనీయం. 2020 నాటికి భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కలాం వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన జీవితంలో చోటుచేసుకున్న కీలక అంశాలను గురించి ఓసారి పరిశీలిద్దాం.. 
 
1998లో ప్రముఖ కార్డియోలజిస్ట్ డాక్టర్ సోమ రాజుతో కలిసి చౌకధర స్టెంట్‌లను కలాం తయారు చేశారు. దీని పేరు కలాం-రాజు స్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల నిమిత్తం వీరిద్దరూ కలిసి ఓ ధృఢమైన టాబ్లెట్ పీసీని తయారు చేశారు. 1998లో ప్రోఖ్రాన్-2 అణు పరీక్షలు జరపడంలోనూ కలాం కీలక పాత్ర పోషించారు. 
 
ఇండియా మిస్సైల్ ప్రోగ్రామ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లిన కలాం అగ్ని, పృథ్వీ క్షిపణుల విజయంతో భారత మిలటరీ శక్తిని మరింతగా పెంచారు. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు బదిలీ అయిన తరువాత కలాం, భారత మొట్ట మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్‌ఎల్‌వీ-IIIకి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల అధ్యక్షుడు... మిస్సైల్ మేన్... భారతరత్న అబ్దుల్ కలాం జీవిత పాఠం...