Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జల దినోత్సవం గురించి బాబు ఎంతసేపు మాట్లాడుతారు? వైసీపీ గొడవ, గుక్కెడు నీళ్లు చాలనే రోజు...

ఏపీ అసెంబ్లీలో ప్రపంచ జల దినోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం చేస్తుండగా వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు జలం ఆవశ్యకత గురించి చెపుతుంటే వైసీపి ఎందుకు అడ్డుపడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా

జల దినోత్సవం గురించి బాబు ఎంతసేపు మాట్లాడుతారు? వైసీపీ గొడవ, గుక్కెడు నీళ్లు చాలనే రోజు...
, బుధవారం, 22 మార్చి 2017 (12:27 IST)
ఏపీ అసెంబ్లీలో ప్రపంచ జల దినోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం చేస్తుండగా వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు జలం ఆవశ్యకత గురించి చెపుతుంటే వైసీపి ఎందుకు అడ్డుపడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నాయకుడు కోడెల సైతం సభకు అడ్డు తగలవద్దని చెప్పినా వైసీపీ నాయకులు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. జలం గురించి చంద్రబాబు నాయుడు చెప్పింది చాలనీ వాదనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు ఇలా జరుగుతున్నాయి. 
 
ఇకపోతే జల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు తప్పవని నీటి లభ్యతపై సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్న ఒక పరిశోధకుడు ఆందోళన వెలిబుచ్చాడు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే గుక్కెడు నీళ్లకోసం ప్రజలు కాట్లాడకునే సంఘటనలు ఎంతో దూరంలో ఉండబోవని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశాడు. నిజమే...
 
ఇదివరకు వేసవి కాలంలో నీటి కొరత సమస్య ఎదురయ్యేది. ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా నీటి కొరత సమస్య వెంటాడుతోంది. పట్టణాలు, నగరాలు నీటికోసం విలవిలలాడుతున్నాయి. నీటి కొరతకు అసలు కారణం విచ్చలవిడిగా పెరుగుతున్న జనాభా పెరుగుల. వీటన్నికీ మించి నీరు వృధాకాకుండా చూడాల్సిన ప్రభుత్వాలే ఉదాశీనంగా వ్యవహరిస్తున్న సంఘటనలు కోకొల్లలు. 
 
ఉదాహరణకు దేశరాజధాని ఢిల్లీలో మంచి నీటి పంపులకు ఆయా ప్రదేశాలలో లీకేజీల వల్ల 40% నీరు వృధా పోతోందని ఆ రాష్ట్రంలోని ఒక స్వచ్చంద సంస్థ ఇటీవల తన నివేదికలో తెలిపింది. దేశ రాజధానిలోనే నీటి పొదుపు ఇలా ఉంటే.... ఇక మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి గురించి వేరే విడమరిచి చెప్పనక్కరలేదు. 
webdunia
 
దీనితోపాటు ప్రజలలో నీటిని పొదుపుగా వాడే అలవాటు లేకపోవడం. ప్రభుత్వాలు ఓట్లకు నోట్లు పంచుతుంటాయి తప్ప ప్రాణాధారమైన ఇటువంటి వనరులను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పాపాన పోవడం లేదు.
 
ఒకవైపు ప్రజలలో నీటి వినియోగం ఇలా ఉంటే... మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వర్షపాతంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అసమానతలు చోటుచేసుకు వర్షాకాలం సైతం వేసవిని తలపిస్తోంది. గ్లోబల్ వార్మిగ్ ఫలితమే దీని వెనుక ఉన్న మూల కారణమని శాస్త్రజ్ఞులు చెవినిల్లు కట్టుకుని ఘోషిస్తున్నా పట్టించుకునేవారెవరు. 
 
ఇప్పటికే నగర ప్రజలు రోజువారీ 10 లీటర్ల నీటి బాటిళ్లను ఒక్కోటి రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అంటే నీటికోసం నెలకు రూ.600 ఖర్చు చేస్తున్నారు. ఇక మధ్యతరగతి, పేద ప్రజల స్థితి వర్ణనాతీతం. కలుషిత నీళ్లను త్రాగుతూ వ్యాధులబారిన పడుతున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. 
 
మరోవైపు ప్రజల ఆహారపు అలవాట్లలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పెరుగుతోంది. ఇది కూడా నీటిని హరించే అంశమే. ఎలాగంటే... మాంసాహారాన్ని తయారు చేసేందుకు అవసరమయ్యే నీరు శాకాహారానికంటే ఆరు నుంచి ఏడు రెట్లు ఎక్కువ. ఇలా అన్నీ కలిసి నీటి కొరతలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. 
 
ముందు తరాలకు నీటి ఉపద్రవం ముంచుకు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రతి నీటి బొట్టును ప్రాణంతో సమానంగా చూసి ఖర్చు చేసినప్పుడే సాధ్యం. మరి నేటి నుంచే మొదలుపెడదామా... నీటి పొదుపును...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ జన్మభూమి- బాబ్రీ వివాదం.. చర్చలకు సిద్ధమే.. ముస్లిం లా బోర్డు ప్రకటన