Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొజ్జల ఔట్.. ముద్దు ఇన్.. చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మంత్రి పదవుల మార్పిడి!

చిత్తూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశంలోనే రాజకీయ లుకలుకలు జరుగనున్నాయి. ఏకంగా మంత్రి పదవుల మార్పిడే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

బొజ్జల ఔట్.. ముద్దు ఇన్.. చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మంత్రి పదవుల మార్పిడి!
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (18:23 IST)
చిత్తూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశంలోనే రాజకీయ లుకలుకలు జరుగనున్నాయి. ఏకంగా మంత్రి పదవుల మార్పిడే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారుతోంది. అటవీశాఖామంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు మంత్రి కావడం దాదాపుగా ఖాయమని విశ్వసనీయ వర్గాలల ద్వారా తెలుస్తోంది. త్వరలో ముద్దుకృష్ణమనాయుడు బొజ్జలకు కేటాయించిన అటవీశాఖకే మంత్రి కానున్నారు.
 
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ప్రస్తుతం అటవీశాఖామంత్రిగా పనిచేస్తున్న బొజ్జల మంత్రి పదవికి సరైన న్యాయం చేయలేదన్న కోపంలో ఉన్నారు అధినేత చంద్రబాబునాయుడు. మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారని మూడునెలలకు ఒకసారి తెలుసుకుంటుంటారు చంద్రబాబు. అలాంటిది మంత్రిగా ఆ శాఖకు సరిగ్గా పనిచేయని వారిలో మొదటి స్థానం బొజ్జలకే దక్కింది. దీంతో ఆయన్ను పదవి నుండే తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈయన ఒక్కరే కాదు ఏపీ కేబినెట్‌లోని మరికొంతమందిని కూడా మంత్రి పదవుల నుంచి తొలగించడం, అలాగే కొంతమంది మంత్రులకు పదవులు మార్చడం జరునుంది.
 
అందులో బొజ్జలకు మాత్రం ఛాన్స్ ఇచ్చినట్లు లేదు చంద్రబాబు. మంత్రి పదవి నుండే దూరంగా పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే స్థానంలో గాలిముద్దుకృష్ణమనాయుడు కొనసాగించాలన్న నిర్ణయానికి బాబు వచ్చారని సమాచారం. దివంగత నేత ఎన్‌టిఆర్‌ హయాం నుంచి సీనియర్‌ నేతగా ముద్దుకృష్ణమనాయుడు వ్యవహరిస్తున్నారు. టీచర్‌గా తన ప్రస్తానాన్ని ప్రారంభించి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ముద్దుకృష్ణమనాయుడుది. ఎన్‌టిఆర్‌ హయాంలో విద్యాశాఖ, అటవీశాఖామంత్రిగా కూడా ముద్దుకృష్ణమనాయుడు పనిచేశారు.
 
ముద్దుకృష్ణమనాయుడుపై చంద్రబాబుకు మంచి అభిప్రాయమే ఉంది. అందుకే నగరి ఎన్నికల్లో ముద్దు ఓడిపోయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని అప్పజెప్పారు. అంతేకాదు ప్రస్తుతం మంత్రిని కూడా చేయనున్నారు. ముద్దుకు మంత్రి పదవి వస్తుందన్న సంకేతాలు ఇప్పటికే ఆయన అనుచరుల్లో కూడా వెళ్లిపోయిందట. ఒకవైపు ముద్దుకృష్ణమనాయుడు అనుచరులు లోలోపల సంబరాల్లో మునిగితేలుతున్నా బొజ్జల వర్గీయులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం మీద మరికొన్ని రోజుల్లో జరుగనున్న మంత్రి పదవుల మార్పుల్లో బొజ్జల అవుట్‌, ముద్దు ఇన్‌ కానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోదా ప్రైవేట్ బిల్లుపై బీజేపీ 'దొంగాట'... ఓటింగ్ పెట్టకుండా తప్పించుకుంది!