Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబును భయపెడుతున్న అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి... పవన్ ఎర్ర జెండా...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మెల్లగా కాకను పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే పొత్తులు, చర్చలు గట్రా జరిగిపోతున్నాయి. జనసేన పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమని వామపక్షాలు ఇప్పటికే ఆ దిశగా ముందడుగు వేశాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే వామపక

బాబును భయపెడుతున్న అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి... పవన్ ఎర్ర జెండా...
, శుక్రవారం, 12 మే 2017 (15:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మెల్లగా కాకను పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే పొత్తులు, చర్చలు గట్రా జరిగిపోతున్నాయి. జనసేన పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమని వామపక్షాలు ఇప్పటికే ఆ దిశగా ముందడుగు వేశాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలకు, తన భావజాలానికి చాలా దగ్గర సంబంధం వుందని చెప్పారు.
 
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాస్తంత ముందుచూపుతో వెళుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల నేరుగా ప్రధానమంత్రితో ఆయన భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడినట్లు చెపుతున్నా... ఈ భేటీలోనే వైకాపా- భాజపా దోస్తికి పావులు కదిపినట్లు తెలుస్తోంది. 
 
ప్రధానిని జగన్ కలవడంపై తెదేపా నాయకులు తీవ్రస్థాయిలో మండిప్డారు. మోదీ వద్దకెళ్లి సాష్టాంగ ప్రమాణం చేసి కేసుల నుంచి తప్పించాలని వేడుకోలు చేసుకున్నారని తెదేపా నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై వైకాప నుంచి ఎంతమంది మాట్లాడారో తెలియదు కాని, భాజపా నాయకుడు విష్ణు కుమార్ రాజు మాత్రం తెదేపా నాయకులపై రివర్స్ ఎటాక్ చేశారు. ప్రధాని గురించి చులకనగా మాట్లాడవద్దనీ, ఐనా ప్రధానమంత్రిని జగన్ మోహన్ రెడ్డి కలిస్తే మీకేంటి అంత భయం అంటూ ప్రశ్నిస్తున్నారు వైకాపా మద్దతుదారులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడియో పిచ్చి.. కళ్లముందు మనిషి కాలిపోతున్నా పట్టించుకోలేదు.. సజీవంగా?