Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరులా విజయ్ కాంత్... డీఎంకెను చావుదెబ్బ కొట్టిన కెప్టెన్... రేసుగుర్రం కాదు కీలుగుర్రం... ఆ యోగా చూడు(వీడియో)

తమిళనాడు ఎన్నికల ఫలితాల వెల్లడైన నేపధ్యంలో ఇప్పుడంతా చిరంజీవి గురించి చెప్పుకుంటున్నారు. అదేంటి.. చిరంజీవికి తమిళనాడు ఎన్నికల ఫలితాల సందర్భంగా చెప్పుకోవడమేమిటని అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నాం. ఈ ఎన్నికల్లో తొలుత డీఎంకెతో జత కలిసి పోటీ చేయాలని

Advertiesment
AIDMK WIN
, గురువారం, 19 మే 2016 (16:15 IST)
తమిళనాడు ఎన్నికల ఫలితాల వెల్లడైన నేపధ్యంలో ఇప్పుడంతా చిరంజీవి గురించి చెప్పుకుంటున్నారు. అదేంటి.. చిరంజీవికి తమిళనాడు ఎన్నికల ఫలితాల సందర్భంగా చెప్పుకోవడమేమిటని అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నాం. ఈ ఎన్నికల్లో తొలుత డీఎంకెతో జత కలిసి పోటీ చేయాలని నటుడు విజయ్ కాంత్ అనుకున్నారు. కానీ చివరాఖరికి ఝలక్ ఇచ్చి సొంతగా పోటీ చేస్తున్నట్లు చెప్పడమే కాకుండా ఏకంగా కరుణానిధికి తమ పార్టీ అభ్యర్థి చేతుల్లో ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపిస్తానంటూ బీరాలు పలికారు. ఐతే... ఫలితాలు చూశాక సీన్ రివర్స్. ఆయన గెలవకపోతే పోయాడు కానీ డీఎంకే పార్టీని మాత్రం చావుదెబ్బ కొట్టాడు. ఆ పార్టీకి పళ్లెంలో పెట్టినట్లు రావాల్సిన అధికార పీఠాన్ని అమాంతం కాలదన్నాడు. 
 
ఓటింగ్ శాతం చూస్తే... డీఎంకె కూటమికి 38.1 శాతం, అన్నాడీఎంకెకు 42.1 శాతం. కేవలం 4 శాతం ఓట్ల తేడాతో జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలిగారు. ఈ ఓట్లన్నీ విజయ్ కాంత్ పార్టీ డీఎండీకేకు చెందినవనేది విశ్లేషకుల అభిప్రాయం. విజయ్ కాంత్ కనుక డీఎంకేతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచి ఉంటే జయలలిత గెలుపు సాధ్యమయ్యేది కాదని చెపుతున్నారు. ఈ సందర్భంగా వారు మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో ఎన్నికలు జరిగినప్పుడు తెదేపా-కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి వచ్చారు. ఆయన రాకతో తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి లాభించింది. దానితో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించగలిగారు. మొత్తమ్మీద విజయ్ కాంత్ రేసుగుర్రమవుతానంటూ కీలుగుర్రంలా మారడంపై తమిళనాట జోకులేసుకుంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఆయన దురుసు ప్రవర్తన అలా ఉంచితే ఇప్పుడు ఈ ఓటమిని తట్టుకునేందుకు ఆయన యోగా చేస్తూ ఉంటారని వీడియోలను సైతం షేర్ చేసుకుంటూ ఖుషీ అవుతున్నారు. చూడండి ఈ వీడియోను... యూ ట్యూబ్ నుంచి....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదుచ్చేరిలో రంగస్వామికి ఝులక్.. కాంగ్రెస్ కూటమికి విజయం