Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ చాణక్యుడు కరుణానిధి ఎత్తులకు అన్నాడీఎంకే తట్టుకునేనా? మోడీనే పెద్ద దిక్కా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో అపర రాజకీయ చాణక్యుడు కరుణానిధి ఎత్తుగడలను తట్టుకుని అన్నాడీఎంకే నేతలు మనుగడ కొనసాగించగ

రాజకీయ చాణక్యుడు కరుణానిధి ఎత్తులకు అన్నాడీఎంకే తట్టుకునేనా? మోడీనే పెద్ద దిక్కా?
, గురువారం, 8 డిశెంబరు 2016 (13:26 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో అపర రాజకీయ చాణక్యుడు కరుణానిధి ఎత్తుగడలను తట్టుకుని అన్నాడీఎంకే నేతలు మనుగడ కొనసాగించగలరా? అనేది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలకు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. 
 
నిజానికి 'అపర రాజకీయ చాణక్యుడు కరుణానిధి ఎత్తులకు పైఎత్తులు వేయగల దిట్టలు ఇప్పుడు అన్నాడీఎంకేలో ఒక్కరు కూడా లేరు. దీంతో ఆ పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమని' రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జయ మరణానంతరం తమిళనాట రాజకీయ మార్పిడిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, పన్నీర్‌సెల్వం చేత అర్థరాత్రి రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక ప్రధాని మోడీ దీర్ఘకాల ప్రయోజనాలు ఉన్నాయని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో కర్నాటక ప్రత్యేక కోర్టు జయలలితకు రెండేళ్ల జైలుశిక్ష విధించినప్పటి నుంచి ఆమె బీజేపీకి దగ్గరయ్యారు. కర్నాటక హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిన తర్వాత జయలలిత మోడీతో భేటీ కావడం, పార్లమెంటులో ఎన్‌డీఏ బిల్లులన్నింటికీ మద్దతు పలకడం వెనుక అనేక మతలబున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు. 
 
ప్రస్తుతం బీజేపీకి తాము చెప్పిన దానికల్లా ఓకే చెప్పే పార్టీ ఎంతో అవసరం. అందుకే జయలలితకు అంజలి ఘటించే సమయంలో శశికళ, సెల్వంలపై మోడీ అవివాజ్యమైన ప్రేమను కురిపించారు. ఇకపై తమిళనాడులో అన్నాడీఎంకే ఉన్నన్నాళ్లు బీజేపీ అధికారంలో ఉన్నట్లేనని ఈ పార్టీ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాత్కాలికంగా మోడీ అడుగులకు మడుగులెత్తాల్సిన ఆగత్యం శశికళ, సెల్వంలకు కూడా ఉంది. 
 
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ కూడా ముద్దాయే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ ముగియగా తీర్పును రిజర్వ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మోడీ.. రాబోయే కాలంలో అన్నాడీఎంకేను తమ పార్టీలో విలీనం చేసుకొనే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తమిళ రాజకీయ పార్టీల నేతలు గట్టిగా నమ్ముతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితకు ''ఎమ్మాలింగ్'' చేశారా? చెంపపై హోల్స్ సంగతేంటి? డిసెంబర్ 5 కంటే ముందే చనిపోయారా?