Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉంటూ సీఎం బాధ్యతలు నిర్వర్తించవచ్చా?

Advertiesment
arvind kejriwal

ఠాగూర్

, శుక్రవారం, 22 మార్చి 2024 (10:28 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పైగా, జైల్లో నుంచే తమ నేత ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ అంశంపై ఇపుడు రసవత్తర చర్చ సాగుతుంది. గతంలో అరెస్టు అయిన ముఖ్యమంత్రులు సీఎం పదవికి రాజీనామాలు చేశారని, ఇపుడు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన పదవికి రాజీనామా చేయలేదు. దీంతో కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఏం జరుగుతుందనే పరిణామాలను కేంద్రం ఆరా తీస్తుంది. పైగా, గతంలో ముఖ్యమంత్రులు ఎవ్వరూ జైలు నుంచి పాలన సాగించినదాఖలాలు లేవని ఢిల్లీలోని తీహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 
కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే పరిస్థితులపై కేంద్ర హోం శాఖ పరిశీలిస్తుంది. మరోవైపు, కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేయాల్సి ఉంటుందని లేదా పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టుకు గురైన ప్రభుత్వ అధికారులకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని, వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేయొచ్చని సూచిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, వుంటే అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్ విధిస్తే ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ గతంలో ముఖ్యమంత్రులు ఎవరూ జైలు నుంచి బాధ్యతలతు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. పైగా, జైలు నిబంధనల్లో అలాంటి ప్రస్తావన లేదని, జైలులో ప్రతిదీ మాన్యువల్ ప్రకారమే జరుగుతుందని ఆయన వివరించారు. కాగా, ఆప్ నేతల్లో మరో కీలక నేత అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషికి పంది మూత్రపిండం అమర్చిన వైద్యులు... ఎక్కడ?