రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ నిలిచారు. 2019 ఎన్నికల వరకు ఓ ఫెయిల్యూర్ పొలిటిషన్ గా ముద్రపడిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం అందరికీ సెంటర్ ఆఫర్ అంట్రాక్షన్ గా మారారు.
2019 ఎన్నికలలో రాజోలు మాత్రమే జనసేన పార్టీ గెలిచింది. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాపాక ప్రసాద్... అధికార వైసీపీ మద్దతు తెలిపారు. దీంతో జనసేన పార్టీ గుర్తింపు కూడా రద్దు అయ్యింది. కానీ ఏమాత్రం వెనుకడుగు వేయని పవన్.. అధికార పార్టీపైన యుద్ధం ప్రకటించారు.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అధికార వైసీపీపై గట్టిగా మాట్లాడేందుకు భయపడినప్పటికీ.. జనసేనాని మాత్రం దూకుడుగానే వ్యవహరించారు. బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆందోళనలు, ఉద్యమాలను మాత్రం ఒంటరిగానే నిర్వహించారు జనసేనాని.
చివరికి ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే విశాఖ పర్యటనకు వెళ్లారు పవన్. అంతకుముందే విశాఖ గర్జన పేరుతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత విమానాశ్రయంలో జరిగిన ఘటనతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
విశాఖ ఎయిర్ పోర్టలో మంత్రులపై దాడి చేశారంటూ.. జనసేన పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే పవన్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించారు. కానీ తమ వారిని వదిలిన తర్వాతే అక్కడ నుంచి వెళ్తానని పవన్ పట్టుబట్టారు. దీంతో కేవలం తొమ్మిది మందిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు.
మిగిలిన వారిని వదిలేశారు. కానీ ఆ తర్వాత నేరుగా మంగళగిరి కార్యాలయానికి వచ్చిన పవన్.. చెప్పు చూపించి మరీ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరి దృష్టి పవన్ పైకి మళ్లింది.