Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ ఆశీస్సులతో 17 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వెబ్ దునియా... సెప్టెంబరు 23 webdunia birth day

వెబ్ దునియా తెలుగు వీక్షకులకు వినయపూర్వక నమస్కారం. నేటితో వెబ్ దునియా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలో అడుగుపెడుతోంది. సెప్టెంబరు 23, 1999న మెదిలిన ఒక ఊహ నిజరూపం దాల్చి వాస్తవ ప్రపంచంలో అద

మీ ఆశీస్సులతో 17 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వెబ్ దునియా... సెప్టెంబరు 23 webdunia birth day
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (22:21 IST)
వెబ్ దునియా తెలుగు వీక్షకులకు వినయపూర్వక నమస్కారం. నేటితో వెబ్ దునియా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలో అడుగుపెడుతోంది. సెప్టెంబరు 23, 1999న మెదిలిన ఒక ఊహ నిజరూపం దాల్చి వాస్తవ ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆనాడు ఒక బృహత్తరమైన సంకల్పంతో, వీక్షకుల కోసం ప్రత్యేక శ్రద్ధతో మరియు సొంత మేధస్సుతో వ్యవస్థాపించిన వెబ్ దునియా, నేడు వాస్తవిక ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి అనేక మైలురాళ్లు దాటింది. 
 
అలా ప్రారంభమయిన వెబ్ దునియా పయనం సాగుతూనే ఉంది. ఈ పయనంలో ఎందరో మాతో చేతులు కలిపి నడిచారు. మరెందరో తమ సేవలు అందించారు. వారందరు అహరహం చేసిన కృషి ఫలితమే నేడు వెబ్ దునియా జయకేతనం ఎగురవేస్తూ ముందుకు సాగుతోంది. ఏ సంస్థకయినా, ఈ 17 ఏళ్ల కాలం సుదీర్ఘ కాలం కాకపోవచ్చు. కానీ ప్రపంచ అంతర్జాలం విషయానికి వస్తే మాత్రం, 17 ఏళ్ల కాలం చాలా చాలా ముఖ్యమైన, అత్యంత పెద్ద విషయమే. ఇంతటి సుదీర్ఘ పయనం అంత సామాన్యమైనది కాదు. 'నయీ దునియా' జాతీయ హిందీ దినపత్రిక గోడౌనులో పుట్టిన వెబ్ దునియా నేడు భారతీయ భాషల్లో అగ్రగామిగా ఉంటూ ప్రధాన భూమిక పోషిస్తోంది. 
 
వెబ్ దునియా వ్యవస్థాపించబడినపుడు అంతర్జాలంతో అనుసంధానమవడం చాలా క్లిష్టతరంగా ఉండేది. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆ అడ్డంకులన్నిటినీ తొలగించుకుని, వాటిని అధిగమించి ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను వెబ్ దునియా శోధించి సాధించింది. ముఖ్యంగా భారతీయ భాషల్లో ఉన్న స్క్రిప్టులకు ఉన్న ప్రాధాన్యం వేరే చెప్పక్కర్లేదు. అది అనన్యసామాన్యమైనది. అలాంటి ప్రత్యేకమైన స్క్రిప్టులను సైబర్ ప్రపంచానికి పరిచయం చేసేందుకు వెబ్ దునియా ఎంతగానో శ్రమించింది. ఇందులో భాగంగా సొంత స్క్రిప్టులను తయారుచేసుకున్నది. ఆ నూతన పరిశోధనల ఫలితమే వెబ్ దునియా సాధించిన నేటి మేటి విజయం. ఆనాటి అద్భుత సృష్టికి మరోసారి హ్యాట్సాఫ్ చెప్పాలి.
 
ఎందుకంటే అప్పట్లో అంతర్జాలంలో ఏ సమాచారాన్నయినా తెలుసుకోవాలంటే తప్పకుండా ఇంగ్లీషుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అప్పట్లో భారతీయ భాషల ఉనికి అంతర్జాలంలో దాదాపు లేదనే చెప్పుకోవచ్చు. ఐతే ఆ భాషలు ఒక ప్రభంజనంలో అంతర్జాలంలో దూసుకువెళ్లే విధంగా వెబ్ దునియా ఎంతగానో పాటుపడింది. అది జరిగిన మరుక్షణం అనుకున్న కల సాకారం అయ్యేందుకు బాటలు పడ్డాయి. ఇప్పుడు ఏ భాషలో ఎవరికి ఏది కావాలన్నా వీక్షించే వీలు ఉంది. సమాచార విప్లవం భూగోళం అంతటా వ్యాపించిన నేపధ్యంలో ఆనాడు భారతీయ భాషల్లో వెబ్ దునియా సృష్టించిన మొక్క ద్వారా మహావృక్షమై వినియోగదారులకు అనేక రీతుల్లో తన సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికీ మేము అహరహం కృషి సలుపుతూనే ఉన్నాం. కొత్తకొత్త ప్రక్రియలను అందించేందుకు అనునిత్యం శ్రమిస్తూనే ఉన్నాం.
 
ఈ విజయ పరంపరలో వెబ్ దునియాతో పయనిస్తున్న, పయనించిన వారందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. అంతేకాదు... వారందరి ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉంటాయని, వారి దీవెనలు, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా వెబ్ దునియాను ఆదరిస్తూ, దినదిన ప్రవర్థమానమయ్యేందుకు సహకరిస్తున్న మా వీక్షకులకు మరోసారి వినమ్ర నమస్కారం తెలియజేసుకుంటున్నాం
 
- మీ ఎడిటర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పాక్ వాడు... ముంబైలో ఎలర్ట్...