Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ అడ్డాలో పట్టపగలు వైకాపా కార్యకర్త దారుణ హత్య

Advertiesment
murder
, శుక్రవారం, 23 జూన్ 2023 (13:02 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆయన పార్టీకే చెందిన కార్యకర్తను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. భూతగాదాల కారణంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మరికొందరికి మధ్య కొన్ని రోజులుగా భూతగాదాలు ఉన్నాయి. కాలక్రమంలో ఇవి మరింతగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యర్థులు శ్రీనివాసులు రెడ్డిపై కక్ష పెంచుకుని ఆయన హత్యకు కుట్ర పన్నారు. 
 
తమ పథకంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీనివాసులు రెడ్డి జిమ్ నుంచి ఇంటికి వెళుతుండగా, బురాఖా ధరించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి మారణాయుధాలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కత్తులతో పొడవడంతో శ్రీనివాసులు రెడ్డి అక్కడే కుప్పకూలి రక్తపుమడుగులో ప్రాణాలు విడిచాడు. కొందరు స్థానికులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వాగులో పడి బీటెక్ విద్యార్థి మృతి 
 
సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణం తీసింది. బీటెక్ కుర్రోడు వాగులో పడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో ఈ నెల 22వ తేదీన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) అనే యువకుడు స్థానికంగా ఉండే కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్‍తో కలిసి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై కంఠాత్మాకూర్ వాగు వద్దకు చేరుకుని, సెల్ఫీలు తీసుకుంటున్నారు. 
 
వాగులోని నీటిని నిల్వచేసేందుకు నిర్మించిన చిన్నపాటి కరకట్ట (చెక్ డ్యామ్) వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన ఇతర స్నేహితులు బిగ్గరగా అరిచారు. సయ్యద్ జాహెద్ షా, అబ్దుల్ షాదాద్‌లు బిగ్గరగా కేకలు వేశాడు. 
 
దీంతో అక్కడ ఉన్న ఇతరులు నీటిలో మునిగిపోతున్న ఇస్మాయిల్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న దామెర ఎస్ఐ రాజేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్న భార్య 
 
తెలంగాణ రాష్ట్రంలో ఒక విషాదకర ఘటన జరిగింది. భర్త వేధింపులు తాళలేని ఓ భార్య... ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని నాచారంలో ఇది జరిగింది. 
 
ఈ హేమంత్, సన అనే భార్యాభర్తల మధ్య గత ఐదు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర మనస్తాపానికి గురైన సన... ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది. ఈ ఘటనపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు హస్తినకు మంత్రి కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ!