Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు నజరానా : వాట్సాప్‌పై ఓ భార్య స్టేటస్!!

Advertiesment
agra woman

ఠాగూర్

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (11:40 IST)
కట్టుకున్న భర్తను చంపేవారికి రూ.50 వేల బహుమతి ఇస్తానని ఓ భార్య ఆఫర్ చేసింది. ఈ మేరకు తన వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టుకుంది. దీన్ని చూసిన భర్త.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా భింద్ గ్రామానికి చెందిన ఓ యువతితో అదే జిల్లా బాహ్ బ్లాక్‌కు చెందిన ఓ యువకుడికి గత 2022 సంవత్సరం డిసెంబరు నెలలో వివాహమైంది. పెళ్లి తర్వాత కేవలం ఐదు నెలలకే వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవలు చెలరేగాయి. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయి, అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. భార్యను ఇంటికి తీసుకునిరావడానికి భర్త ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, అతను అత్తారింటికి వెళ్లినపుడల్లా చంపేస్తామని భార్య, అత్తమామలు బెదిరిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని తన భార్యపై భర్త ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తన భార్యకు ఆమె పక్కింటిలో ఉన్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, తమ మధ్య గొడవకు కారణం కూడా ఇదేనని చెప్పాడు. ఓ వైపు కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగా, మరోవైపు భార్య తరపు వాళ్లు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని భర్త ఆరోపిస్తున్నాడు. తన భార్య ప్రియుడు కూడా ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్టు పోలీసులకు తెలిపాడు. యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు భార్యను, ఆమె తల్లిదండ్రులను విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన