Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేటింగ్ యాప్‌లో పరిచయం, మౌనికకు రూ. 3.50 లక్షలు ఇచ్చాడట, మొండెం ఫ్రిడ్జిలో తలకి నిప్పు పెట్టి...

Advertiesment
Mounika
విశాఖపట్టణంలో వెలుగు చూసిన మౌనిక హత్య కేసులో మరో విషయం బైటపడింది. మౌనిక తనకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. తొలుత ఆమెకి రూ. 3.50 లక్షలు ఇచ్చాననీ, ఐతే ఆ తర్వాత కూడా డబ్బు కావాలంటూ వేధించడంతో చంపేసినట్లు నిందితుడు రవీంద్ర చెప్పినట్లు సమాచారం.
 
విశాఖపట్టణంలోని ఎల్వీ నగరులో విజయనగరం రాజాంకు చెందిన 35 ఏళ్ల రవీంద్ర నేవీలో టెక్నీషియన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం పెళ్లయ్యింది. ఐతే అంతకుముందే మౌనిక అనే యువతితో సన్నిహిత సంబంధం వుంది. భార్యను పుట్టింటికి పంపించిన రవీంద్ర తన మాజీ ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిచాడు. అర్థరాత్రి దాటాక ఆమెను కత్తితో నరికి హత్య చేసాడు.
 
ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఎలాగూ పోలీసులకు దొరికిపోతానని అతడే నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి నిజం చెప్పేసాడు. తనను తన మాజీ ప్రియురాలు తరచూ డబ్బు కోసం వేధిస్తోందనీ, అందువల్ల ఆమెను హత్య చేసినట్లు పోలీసులతో చెప్పాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతురాలి శరీర భాగాలున్న రెండు మూటలను కనుగొన్నారు. ఐతే ఆమె తల భాగాన్ని బ్యాగులో పెట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తగులబెట్టినట్లు నిందితుడు చెప్పాడు. ఐతే నిందితుడు చెప్పిన వివరాల్లో ఎంతవరకు నిజం వున్నదన్న విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీట్లు లేవని రైలు డోరు వద్ద వేలాడుతూ ప్రయాణం, కిందపడకుండా టవల్‌తో కట్టేసుకున్నారు