Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళను లొంగదీసుకుని ఏడాదిగా అత్యాచారం

Advertiesment
rape
, శనివారం, 16 ఏప్రియల్ 2022 (17:22 IST)
ఓ కేసుపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకి వెళ్లిన మహిళకు ఆసరాగా నిలుస్తానని నమ్మించి ఆపై చనువు పెంచుకున్నాడు ఓ పోలీసు ఇన్ స్పెక్టర్. ఆ తర్వాత ఆమెతో చాటింగ్ చేస్తూ శృంగార సంభాషణ ప్రారంభించాడు. ఆ సంభాషణ బయటపెడతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.

 
వివరాల్లోకి వెళితే... ముంబై పోలీసులు ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై బ్లాక్‌మెయిలింగ్ చేసినందుకు, మహిళను కనీసం ఒక సంవత్సరం పాటు లైంగికంగా వేధించినందుకు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తూర్పు శివారులోని ఒక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. గతంలో అక్కడ నియమించబడిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

 
2019లో ఓ కేసుకు సంబంధించిన బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఫిర్యాదును పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్న గంగాధర్‌ పాటిల్‌కు అందజేసింది. బాధితురాలిపై కన్నేసిన పాటిల్... ఫిర్యాదు విషయంలో తనకు సహాయం చేస్తానని మహిళను నమ్మించాడు. కేసు గురించి చర్చించాలంటూ తరచూ ఆమె ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. ఆమెకు శృంగారపరమైన వాట్సాప్ సందేశాలను కూడా పంపాడు.

 
ఈ క్రమంలో ఆమెను బెదిరించి లైంగికంగా లొంగదీసుకున్నాడు. 2021 ఏప్రిల్‌ నెల నుంచి పాటిల్ తనను బెదిరించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళ పోలీసులకు తెలిపింది. లైంగిక ప్రయోజనాల కోసం పాటిల్ తనను పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. చివరకు పాటిల్ గతేడాది పదవీ విరమణ చేయడంతో సదరు మహిళ ఫిర్యాదుతో జోనల్ డీసీపీని ఆశ్రయించింది. దీంతో డీసీపీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఇది తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెయిరీ డే 2 ప్రీమియం ఐస్ క్రీం టబ్స్ వేసవికాలంలో విడుదల