Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాత్రూంలో ఉరేసుకున్న భార్య - మృతదేహం చూసి రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ

Advertiesment
si couples
, గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఎస్ఐ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బాత్రూమ్‌లో భార్య ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికే భర్త కూడా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇరువురూ ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది. 
 
స్థానికుల సమాచారం మేరకు బుధవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాస్, ఆయన భార్య స్వరూపల మధ్య గొడవ జరిగింది. గురువారం ఉదయం స్వరూప బాత్రూంలో ఉరివేసుకుని చనిపోయింది. భార్య ఆత్మహత్యతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. భార్య మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఎంత పనిచేశావు స్వరూపా.. అంటూ శ్రీనివాస్ గుండెలవిసేలా రోదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా రూపొందింది.
 
ఏడుస్తున్న శ్రీనివాస్‌ను బంధువులు స్నేహితులు ఓదార్చుతున్న దృశ్యాలు వీడియో కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ నుదుట గాయమైనట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి గదిలోకి వెళ్లిన శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌తో నుదుటిపై కాల్చుకుని చనిపోయారు. కాగా, గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకోవడంతో స్థానికు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు.. నాలుగు గంటలు ఆలస్యం