తమిళనాడులోని కడలూరులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తన తోటి స్నేహితుడొకరు పుట్టినరోజు వేడుకకి రమ్మని ఆహ్వానించాడు.
ఆమె అక్కడికి వెళ్లగానే... కేక్ కట్ చేసిన తర్వాత ఆమెకి ఆనుకుని మరో ముగ్గురు విద్యార్థులు ఫోటో దిగారు. ఆ తర్వాత ఆ ఫోటోను ఆమె సెల్ ఫోనుకి పంపి... తమ కోర్కె తీర్చకపోతే ఆ ఫోటోను నెట్లో పెడతామని బెదిరించారు.
దాంతో భయపడిన విద్యార్థిని వారిని బ్రతిమాలేందుకు వెళ్లింది. ఐతే జూలై 1న సదరు విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనకు సంబంధించి వీడియోలు తీసి మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కడలూరు జువైనల్ హోంకి తరలించారు.